https://oktelugu.com/

Tollywood: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దూసుకుపోతోన్న “పరంపర”..

Tollywood:సీనియర్ నటుడు జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో పగ ప్రతీకారాల నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ “పరంపర”.ఈ డిసెంబర్ 24న ఓటీటీ వేదికగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సిరీస్ ను ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇటీవలే జరిగిన బిగ్ బాస్ ఫినాలే లో కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 25, 2021 / 03:56 PM IST
    Follow us on

    Tollywood:సీనియర్ నటుడు జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో పగ ప్రతీకారాల నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ “పరంపర”.ఈ డిసెంబర్ 24న ఓటీటీ వేదికగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సిరీస్ ను ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇటీవలే జరిగిన బిగ్ బాస్ ఫినాలే లో కూడా ఈ వెబ్ సిరీస్ ను ప్రమోషన్ చేయడం జరిగింది. ఉత్కంఠ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ సిరీస్. తాజాగా ఈ సిరీస్ విశేషాలను తెలిపారు హీరో నవీన్ చంద్ర.


    ఇంకా ఈ వెబ్ సిరీస్ కథకి వస్తే మూడు జెనరేషన్స్ ఆధారంగా తెరకెక్కించారు అని తెలుస్తుంది.ఈ కథను పెర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశానని” రైటర్ హరి ఏలేటి ఎమోషనల్ గా చెప్పారు.”పరంపర” అనేది వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. ఫ్యామిలీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ యువతకు మరియు కుటుంబ సభ్యులకు కూడా బాగా నచ్చుతుందని తెలిపారు. మొదటి సీజన్ ప్రేక్షకులకు గ్యారంటీ గా నచ్చుతుంది అంటూ హీరో నవీన్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుందని టాక్ కూడా వినిపిస్తుంది.