
Child Artist : రాజమౌళి కంపెనీ నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆయన సినిమాల్లో నటించిన తరువాత చాలా మందికి స్టార్ డం వచ్చింది. అలాంటి వారిలో రవితేజ ఒకరు. అప్పటి వరకు రవితేజ హీరోగా గుర్తింపు పొందినా.. రాజమౌళి తీసిన ‘విక్రమార్కుడు’ తరువాత ఆయన రేంజ్ పాన్ ఇండియా లెవల్ కు వెళ్లింది. ఇందులో డ్యూయల్ రోల్ లో కూడా నటించి మెప్పించడంతో రవితేజ స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమాలో రవితేజ కూతురుగా నటించిన పాప సినిమాకు కీలకంగా మారుతుంది. ముద్దు ముద్దు మాటలతో అమాయకంగా కనిపించిన ఈ చిన్నారి గురించి తెలుసుకోవడానికి అప్పట్లో తెగ సెర్చ్ చేసేవారు.
ఈ పాప పేరు నేహ. ఈమె అమెరికాలో జన్మించింది. అయితే ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. ఈమెను చూసిన రాజమౌళి తన కథకు సరిపోయే అమ్మాయి దొరికిందని అనుకొని ‘విక్రమార్కుడు’ సినిమాల్లోకి తీసుకున్నారు. ఇందులో రవితేజ కూతురిగా నేహ చాలా చక్కగా నటించింది. ఈ సినిమా తరువాత నేహ అనసూయ, ఆది విష్ణు, రక్ష లాంటి సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో నటించడం ద్వారా చదవుకు భంగం కలుగుతుందని ఆమె తల్లింద్రులు ఎంకరేజ్ చేయలేదు. దీంతో కొన్నాళ్ల పాటు చైల్డ్ ఆర్టిస్టుగా చేసి మానుకుంది.
ప్రస్తుతం నేహ ఏ సినిమాలో నటించడం లేదు. తన చదువుపైనే దృష్టి పెట్టింది. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ గా మారుతున్నారు. కానీ నేహ ఆ రకంగా ప్రయత్నించడం లేదు. చదువు పూర్తయ్యాక ఆలోచిస్తానని అంటోంది. సినిమాలే జీవితం కాదని, చదువు ప్రాధాన్యమని పలు సందర్భాల్లో ఆమె తల్లిదండ్రులు చెప్పారట. అందుకే ఆమె ఇండస్ట్రీ వైపు ఎక్కుడా ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.
అయితే నేహ మాత్రం సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటోంది. ఆమె లేటేస్ట్ పిక్స్ నెట్టింట్లో పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో ఉన్న నేహను మళ్లీ సినిమాల్లోకి రావాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. కానీ ఆమె ఎవరినీ రిప్లై ఇవ్వడం లేదు. సినిమాల్లోకి రావాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. కానీ ఈమె పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.