లైఫ్ స్టైల్India Tourism : స్విట్జర్లాండ్.. మాల్దీవులు అంటూ వెళ్తారు గానీ.. మనదేశంలో వీటి ముందు అవి...

India Tourism : స్విట్జర్లాండ్.. మాల్దీవులు అంటూ వెళ్తారు గానీ.. మనదేశంలో వీటి ముందు అవి దిగదుడుపే

India Tourism : దైనం దిన జీవితంలో ఉరుకులు పరుగులు. ఇలాంటప్పుడు మనిషికి కాస్త సాంత్వన కావాలి. ఒత్తిడి నుంచి ఉపశమనం లభించాలి. అవన్నీ కావాలంటే కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లాలి. లేదా విహారయాత్రకు జై కొట్టాలి. పేద, మధ్యతరగతి వారు వారి చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టి రావడానికి ఇష్టపడతారు. అదే డబ్బున్న వాళ్లయితే విదేశాలకు వెళ్తారు. అయితే చాలామంది విహారయాత్ర అంటే స్విట్జర్లాండ్.. లేదా ఇతర దేశాలకు వెళుతుంటారు. కానీ మనదేశంలోనూ అంతకు మించి అనే విహార ప్రదేశాలున్నాయి. ఇండియాలోనే ఉన్నప్పటికీ విదేశాల్లో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంటాయి. ఇంతకీ అవేంటంటే..

ఖజ్జియార్

ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. చుట్టూ మంచుకొండలు.. ఆకాశాన్ని తాకే విధంగా ఉన్న వృక్షాలు.. అందమైన సెలయేళ్లతో ఈ ప్రాంతం చూసేందుకు స్విట్జర్లాండ్ లాగా కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందమైన ప్రదేశాలను చూడాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం.

లక్షద్వీప్

ఆ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించింది ఈ ప్రాంతాల్లోనే. మాల్దీవులకు మించి ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. అందమైన దీవులు.. వాటిని దాకే సముద్ర జలాలు.. చూసేందుకు ఆ దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

గుల్మార్గ్

జమ్మూ కాశ్మీర్లోని బారా ముల్లా జిల్లా ప్రాంతంలో గుల్మార్గ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది. ఆ దృశ్యాలను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని అక్కడి స్థానికులు ఇండియన్ స్విట్జర్ లాండ్ అని పిలుస్తుంటారు.

శ్రీనగర్ మార్కెట్..

శ్రీనగర్ మార్కెట్ పండ్లు, ఫలాలకు ప్రసిద్ధి చెందింది. బోట్ లో ప్రయాణించి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ వాటిని కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది దానిని బ్యాంకాక్ బోట్ మార్కెట్ గా అభివర్ణిస్తుంటారు.

మున్నార్

తేయాకు తోటలకు మున్నార్ హిల్స్ ప్రసిద్ధి. ఎత్తైన కొండల మధ్య తేయాకు మొక్కలు ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా కనిపిస్తాయి. ఇవి చూసేందుకు మలేషియాలోని కామెరాన్ హైలాండ్స్ లాగా కనిపిస్తాయి.

షిల్లాంగ్

మేఘాలయ రాష్ట్ర రాజధాని అయిన ఈ ప్రాంతాన్ని “స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్” అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఉన్న చాలా ప్రదేశాలు స్కాట్లాండ్ లో ఉన్న వాటిని పోలి ఉంటాయి.

మలానా

మలానా అనేది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక హిల్ స్టేషన్.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం చూసేందుకు గ్రీస్ నగరాన్ని పోలి ఉంటుంది.

పుదుచ్చేరి

తమిళనాడుకు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ఫ్రెంచ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఫ్రెంచ్ పాలకులు ఎక్కువగా పాలించడంతో ఇక్కడ చేపట్టే ప్రతి నిర్మాణం ఫ్రెంచ్ దేశంలో మాదిరి ఉంటుంది. ఈ ప్రాంతంలో విహరిస్తే ఫ్రెంచ్ దేశంలో నడిచినట్టే ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా?

Indus Waters Treaty : సరిహద్దులపై తుపాకులు మోగినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుద్ధంపైనే ఉంటుంది. కానీ భారత్–పాకిస్తాన్ మధ్య అసలు పోరు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు. నీటి బొట్టు కోసం...

India Pakistan : పాకిస్తాన్‌పై మోదీ బురద బాంబు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం!

India Pakistan : భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నీటి వనరులు ఎప్పుడూ సున్నితమైన అంశంగా ఉన్నాయి. గతేడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ 1960 నాటి సిందూ...

Most Popular

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...

Stress Relief: రోజులో 24 నిమిషాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం..

Stress Relief: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కంటే...
Exit mobile version