https://oktelugu.com/

Google Pixel 8a: భారత మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 8a .. ఇంతకీ దీని ప్రత్యేకతలు ఏంటంటే..

గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ లో అదిరిపోయే సౌకర్యాలున్నాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పని చేస్తుంది..64mp కెమెరా కలిగి ఉన్న ఈ ఫోన్ అద్భుతమైన దృశ్యాలు తీస్తుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 21, 2024 / 10:48 AM IST

    Google Pixel 8a Review

    Follow us on

    Google Pixel 8a: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లీడర్ గా ఎదిగేందుకు గూగుల్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గూగుల్ పిక్సెల్ పేరుతో స్మార్ట్ ఫోన్ లను తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో రకరకాల వెర్షన్లను విడుదల చేస్తోంది. అందులో తాజాగా మన దేశ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 8a అనే మోడల్ ను ప్రవేశపెట్టింది. ఇంతకీ దీని విశేషాలు ఏంటంటే..

    గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ లో అదిరిపోయే సౌకర్యాలున్నాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పని చేస్తుంది..64mp కెమెరా కలిగి ఉన్న ఈ ఫోన్ అద్భుతమైన దృశ్యాలు తీస్తుంది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్ పై గూగుల్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వాస్తవానికి ఈ ఫోన్ మే 14న భారత మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉండగా.. ఏడు రోజుల ముందుగానే google విడుదల చేసి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచింది..

    ఈ ఫోన్లో ఏఐ ఫీచర్ ఉంది, జీ -3 ప్రాసెసర్, ఇంటర్నల్ జెమిని ఏఐ, సొంత సెన్సార్ కలిగి ఉంది. ఇక ఇంతకుముందు భారత మార్కెట్లో గూగుల్ రిలీజ్ చేసిన గూగుల్ పిక్సెల్ 7a ధర 43,999 గా ఉండేది. అయితే దీనికంటే గూగుల్ పిక్సెల్ 8- a ధర 9000 వరకు ఎక్కువగా అంటే 52,999 వరకు ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ను 39,999 కి పొందే అవకాశం ఉంది.

    గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ ను Flipkart లో గూగుల్ ప్రీ ఆర్డర్ బుకింగ్ లో అందుబాటులో ఉంచింది. Flipkart వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఈ ఫోన్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు మే 14 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో గూగుల్ అందుబాటులో ఉంచింది. 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర 52, 999, 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర 59,999 గా నిర్ణయించింది.. అయితే పలు బ్యాంకులు ఈ ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నాయి .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజర్లకు 4000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.. ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద 9000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాంటప్పుడు ఈ ఫోన్ ను 39,999 కే పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ ను ప్రీ ఆర్డర్లో బుక్ చేస్తే 999 కే ఏ – సిరీస్ ఇయర్ పిక్సల్ బడ్స్ ను కొనుగోలు చేయొచ్చు.