Best Honeymoon Places: పెళ్లయిన కొత్త జంటలు కొన్ని రోజులపాటు సరదాగా గడపాలని అనుకుంటారు. ఇందులో భాగంగా ఉన్నచోట నుంచి ఇతర ప్రదేశాలకు విహారయాత్రలుగా వెళ్తారు. కొత్త జంట అన్యోన్యంగా ఉండేందుకు భారతదేశంలో అణువైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్లి కొన్ని రోజులపాటు గడపడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. వీటిని హనీమూన్ స్పాట్ గా పేర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రకృతి, ప్రైవసీ, రొమాంటిక్ వాతావరణం లో హాయిగా గడపవచ్చు. మరి అలాంటి ప్రదేశాలు మన భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో చూద్దాం..
మున్నార్ (కేరళ):
దక్షిణ భారతదేశంలోని కేరళ కొత్త జంటలకు అనువైన ప్రదేశం. ఇక్కడ టీ తోటలు ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ వాతావరణం కలిగిన ఇల్ స్టేషన్, అలప్పి బ్యాక్ వాటర్ లో హనీమూన్ ఎంజాయ్ చేయవచ్చు. ప్రశాంతంగా ఈ వాటర్ పై పడవలో కొన్ని రోజులు ఉండడానికి ప్యాకేజీలు కూడా ఉంటాయి.
గుల్మార్గ్, పహల్గాం (శ్రీనగర్):
ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిన పహాల్గం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడికి ఎక్కువగా కొత్త జంటలు వస్తూ ఉంటారు. దీనినే భూమిపై స్వర్గం అని కూడా పిలుస్తారు. మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రశాంతమైన సరస్సులు ఇక్కడ ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్న డాల్ లేక్ లో షికార రైడ్ కొత్తజంటలకు అనుభూతిని ఇస్తుంది.
సిమ్లా, మనాలి (హిమాచల్ ప్రదేశ్):
హనీమూన్ కు వెళ్లాలని అనుకునే జంటలు మొదట ఎంచుకునే ప్రదేశం మనాలి. ఇక్కడ బ్రిటిష్ శైలి నిర్మాణాలు,, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆకట్టుకుంటాయి. ఇక్కడికి వచ్చే కొత్త జంటలు ఎంతో ఎంజాయ్ చేయవచ్చు.
గోవా బీచ్:
సముద్ర తీరాల వద్ద ఉల్లాసంగా ఉండడానికి.. నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి.. గోవా ప్రత్యేకం అని చెప్పవచ్చు. హనీమూన్ కోసం వచ్చే జంటలు నార్త్ గోవాలో ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణంతో హాయిగా కడపవచ్చు.
హవేలాక్ దీవి (అండమాన్):
సముద్రం మొత్తం నీలిరంగులో కనిపించే ఈ ప్రదేశం ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న దీవులు స్వర్గంలా కనిపిస్తాయి. రాధానగర్ బీచ్ ఆసియాలోని అందమైన బీచ్ గా పేర్కొంటారు.
ఊటీ, కొడైకెనాల్ (తమిళనాడు):
దక్షిణాది ప్రజల్లో కొత్తగా పెళ్లయిన వారు ముందుగా ఇక్కడికి రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏ కాలంలోనైనా ఇక్కడ చల్లటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్న కొండలను క్వీన్ ఆఫ్ హిల్స్ అని అంటారు. అలాగే ఇక్కడ టీ తోటలు, సరస్సులు అన్ని రొమాంటిక్ మూడ్ ను తెప్పిస్తాయి.
ఉదయపూర్ (రాజస్థాన్):
విలాసవంతమైన ప్యాలెస్ లు, అద్భుతమైన హోటల్స్ అన్ని అనుకూలంగా ఉండడంతో ఉదయపూర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరోవైపు జై సల్మేర్ ఎడారి క్యాంపింగ్ కొత్త జంటలకు సూపర్బ్ అనిపిస్తుంది.
మహాబలేశ్వరం (మహారాష్ట్ర):
మహారాష్ట్రలోని మహాబలేశ్వరం సాధారణంగా వీకెండ్ ట్రిప్ వేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఇక్కడి కొండలు చల్లటి వాతావరణాన్ని ఇస్తాయి. ఈ వాతావరణంలో కొత్త జంటలు ఉండడంవల్ల వారు అన్యోన్యంగా ఉండగలుగుతారు.