Hanuman Flag: జనరల్‌గా హిందువులు తాము ఆరాధించే దేవుళ్ల ప్రతిమలను, ఫొటోలను ఇంటిలో ప్రతిష్టించుకుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తుంటారు కూడా. కాగా, దాదాపుగా అందరూ ఆరాధించే దేవుళ్లలో ఆంజనేయుడు ఉంటాడు.

ఈ క్రమంలోనే చాలామంది వారి ఇళ్లపై ఆంజనేయస్వామి జెండాలను పెట్టుకుంటుంటారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి ఫొటోలను తగిలించుకుంటారు. కాగా, ఇలా హనుమంతుడి జెండాలను, ఫొటోలను పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

బలవంతుడు అయిన ఆంజనేయస్వామికి ఉన్న బలం గురించి అందరికీ తెలుసు. అయితే, హనుమంతుడు బలంతో పాటు భూత ప్రేత పిశాచులనైనా తన పాదాల కింద తొక్కేస్తారు. ఈ నేపథ్యంలోనే హనుమంతుడిని బలానికి ప్రతీకగా భక్తులు భావిస్తుంటారు. తమకు కావాల్సినంత బలాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంటారు. ఇకపోతే పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే సమయంలో శ్రీకృష్ణుడు తన రథానికి హనుమంతుడి జెండా కట్టి రథసారథిగా మారుతాడు. అలా జెండాతో యుద్ధంలోకి దిగడం వలనే పాండవులు విజయాన్ని పొందారని పెద్దలు చెప్తుంటారు.
ఇకపోతే హనుమంతుడి జెండాను ఇంటిపైన కట్టడం వల్ల ఆ ఇంటిలోకి ప్రతి కూల శక్తులు రావు. ప్రతి కూల పరిస్థితులను అడ్డుకోవడంలో హనుమంతుడు ఉంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. హనుమంతుడి ఫొటోను కాని జెండాను కాని ఇంటి లోపల ప్రతిష్టించుకున్నట్లయితే ఇంటిలోని ఎటువంటి దుష్టశక్తులు రాబోవని భక్తుల ప్రగాఢ నమ్మకం.
హనుమంతుడికి ఉన్న బలం, పరాక్రమం గురించి అందరికీ తెలుసు. రామాయణంలో హనుమంతుడు.. శ్రీరాముడికి తోడుగా ఉంటూ చాలా సాయం చేశాడు. కాగా, అటువంటి హనుమంతుడి బలం శ్రీరాముడికి తెలుసునని, అందుకే హనుమంతుడిని తనతో రాముడు తీసుకెళ్లాడని పెద్దలు వివరిస్తుంటారు. హనుమంతుడికి ఉన్నంత శక్తి తమకు ఉండాలని ఈ సందర్భంగా చాలా మంది భక్తులు ఎప్పుడూ ప్రార్థిస్తుంటారు. హనుమాన్ టెంపుల్స్‌లో పూజలు చేస్తూనే తమ ఇళ్లలో హనుమాన్ ఫొటోలు, జెండాలు పెట్టుకుంటుంటారు. అలా అతి బలవంతుడైన హనుమంతుడి అనుగ్రహం పొందేందుకుగాను అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.