What girls search on Google: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది తమకు కావలసిన విషయాలను.. సందేహాలను గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. ఇతరులతో చెప్పుకోలేని.. అడగలేని విషయాలను కూడా గూగుల్ లో శోధిస్తున్నారు. అయితే అమ్మాయిలు ఎటువంటి విషయాలను గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు? అనే విషయం కొంతమందికి ఆసక్తిగా ఉంటుంది. ఇటీవల బయటపెట్టిన నివేదికల ప్రకారం కొంతమంది 5 విషయాలపై ఎక్కువగా సర్చ్ చేస్తున్నట్లు తేలింది. ఇంతకీ ఆ ఐదు విషయాలు ఏవో చూద్దాం..
బ్యూటీ అండ్ మేకప్స్:
అమ్మాయిలు ఎక్కువగా అందం కోసం ఆరాటపడుతూ ఉంటారు. అందంగా ఉండడం కోసం ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ వాడాలి? అనే విషయాలపై గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ షాపింగ్ పెరిగిన తర్వాత కొంతమంది బ్యూటీ క్రీమ్స్ వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందంపై వీడియోలు పెడితే వాటిని ఎక్కువగా అమ్మాయిలే లైక్ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
ఫ్యాషన్ అండ్ స్టైల్:
అందంగా ఉండడంతో పాటు అందమైన దుస్తులు వేసుకోవాలని కూడా అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. మార్కెట్లోకి ఏ కొత్త ఫ్యాషన్ డ్రెస్ వచ్చినా.. వెంటనే కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ లోనే రకరకాల మోడల్స్ అందుబాటులో ఉండడంతో వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఫెస్టివల్ కోసం లేదా పార్టీ wear కోసం ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ షాపింగ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్లోకి కొత్తగా ఎలాంటి ఫ్యాషన్ ట్రెండ్ అవుతుంది అనే విషయాన్ని సెర్చ్ చేస్తున్నారు.
కొరియన్ డ్రామా:
ఇటీవల సోషల్ మీడియాలో కొరియన్ డ్రామా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ట్రాన్స్లేట్ అయి తెలుగులో కూడా వినిపిస్తున్నాయి. వీటికోసం అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడికి కల్చర్ ఇండియాకు సంబంధం ఉన్నట్లుగా ఉండడంతో పాటు హ్యూమన్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు కొరియన్లు చేస్తుండడంతో వాటికోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బెస్ట్ K డ్రామాస్, k pop డైట్ సీక్రెట్స్ వంటివి పాపులర్ గా ఉన్నాయి.
హెల్త్ అండ్ ఫిట్నెస్:
ప్రస్తుత కాలంలో వాతావరణం కలుషితం కావడంతో ఆరోగ్యం ప్రధానం అని అమ్మాయిలు భావిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి కావాలని అనుకునే యువతులు బరువు పెరిగితే వెయిట్ లాస్ టిప్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అలాగే హార్మోన్ ఇన్ బాలన్స్, రెగ్యులర్ వ్యాయామం వంటి వాటికోసం వెతుకుతున్నారు.
స్టడీస్ అండ్ కెరీర్:
భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఎలాంటి కోర్సు చేయాలి? ఏది మంచి ఉద్యోగం? అనే విషయాలపై అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ కోర్సులు ఏమేమి ఉన్నాయి? అనే వాటిపై కూడా వెతుకుతున్నారు.
ఈ ఐదు అంశాలే కాకుండా ఇతరులతో చెప్పుకోలేని.. ఇతరులను అడగలేని కొన్ని పర్సనల్ విషయాలను కూడా అమ్మాయిలు వెతుకుతున్నట్లు గూగుల్ నివేదికలు తెలుపుతున్నాయి.