Age: క్యాలెండర్‌లో ఏడాది మారే కొద్ది మన వయసు కూడా పెరుగుతుంది. ఇది కామన్. ప్రకృతి సిద్ధం కూడా. కానీ కొంతమంది ఏజ్ త్వరగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొందరగా ముసలివారు అయినట్లు కనిపిస్తారు. వారి ఏజ్ వారితో పోల్చి చూసినా ముసలివారిలా కనిపిస్తారు. కొందరు వయసుకన్నా యంగ్‌గా కనిపిస్తారు. అయితే వయసు వేగంగా పెరగడానికి 5 కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
నీళ్లు తాగకపోవడం..
మనం తక్కువగా నీళ్లు తాగడం వలన ఏజ్ వేగంగా పెరుగుతుందట. నతానియా పరిశోధన ప్రకారం మన బాడీకి అవసరమైన నీళ్లు తాగకపోతే సోడియం పెరిగి ఏజ్ పెరుగుతుందట.
ఒకే చోట కూర్చోవడం..
ఇక ఒకేచోట కూర్చోవడం కూడా ఏజింగ్ పెరగడానికి కారణం అవుతుందట. మన డీఎన్‌ఏపై ఎండ్ క్యాప్‌పై ఉండే టెరోమెరా ఉంటుంది. ఎక్కువగా కూర్చోవడం వలన ఇది త్వరగా కరిగిపోయి ఏజ్ పెరిగినట్లు అనిపిస్తుంట.
నిద్ర లేమి..
సరిగ్గా నిద్రకపోయినా ఏజ్ పెరుగతుందట. యూసీఎల్‌ఏ రిసెర్చ్ ప్రకారం.. సరిగా నిద్రపోయపోయినా.. ఆలస్యంగా నిద్రపోయినా మన ఏజ్ పెరుగుతంట.
టాక్సిక్ రిలేషన్‌షిప్స్..
ఎక్కువ మందితో రిలేషన్ నెరిపేవారిలో కూడా ఏజ్ తొందరగా పెరుగుతుందట. దీని కారణంగానే మన ముఖంపై గీతలు ఏర్పడతాయట. మువడతలు ఏర్పడతాయట.
కామెంట్ చేయడం, ఆర్గ్యూ చేయడం..
ఇక చివరి కారనం కామెంట్ చేయడం. దానిని సమర్థించుకునేందుకు ఆర్గ్యూ చేయడం కూడా ఏజ్‌ను పెంచుతుందట. వాళ్ల డీఎన్‌ఏ కూడా దెబ్బతింటుందట. అందుకే ఆర్గ్యూ చేయడం తగ్గించుకోవడం చాలా మంచిది.