Home Tips: ఇంట్లో బల్లులు సమస్య వేధిస్తోందా… ఈ చిన్న చిట్కాలతో తరిమికొట్టండి!

Home Tips: బల్లి ఈ పేరు వినడానికి కూడా చాలామంది భయపడతారు. ఇక బల్లులు కనుక ఇంట్లో కనిపిస్తే కొందరు ఇంతెత్తున ఎగిరి కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఇంట్లో బల్లులు కనబడితే చాలామంది ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.ఈ క్రమంలోని ఇంట్లో నుండి బల్లులను తరిమికొట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ఇంట్లో నుంచి బల్లులను తరిమేయాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించాలి… ఇంటిని శుభ్రంగా […]

Written By: Navya, Updated On : February 22, 2022 10:08 am
Follow us on

Home Tips: బల్లి ఈ పేరు వినడానికి కూడా చాలామంది భయపడతారు. ఇక బల్లులు కనుక ఇంట్లో కనిపిస్తే కొందరు ఇంతెత్తున ఎగిరి కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఇంట్లో బల్లులు కనబడితే చాలామంది ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.ఈ క్రమంలోని ఇంట్లో నుండి బల్లులను తరిమికొట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ఇంట్లో నుంచి బల్లులను తరిమేయాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించాలి…

Home Tips

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం: బల్లులు ఎక్కడపడితే అక్కడ ఊరికే మనకు కనిపించవు ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ప్రదేశాలలో ఎక్కువగా నివసిస్తాయి అందుకే వీలైనంత వరకు మన ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం వల్ల బల్లుల సమస్య తగ్గిపోతుంది. అందుకే వీలైనంత వరకు సెల్ఫ్ లను శుభ్రంగా సర్దుకొని ఉండటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

ఇక సిట్రస్ జాతికి చెందిన పండ్లు లేదా, ఆకులు వంటి వాటి వాసన బల్లులకే కాదు ఏ ఇతర కీటకాలకు కూడా పడదు అందుకోసమే లెమన్ గ్రాస్ బల్లులను తరిమికొట్టడానికి ఎంతో సులువైన మార్గం.లెమన్ గ్రాస్ ను కాస్త నూనెలో ముంచి ఎక్కడైతే బల్లులు తిరుగుతుంటాయో అక్కడ వేలాడదీయడం వల్ల బల్లుల సమస్య తగ్గిపోతుంది.

Also Read: అక్క‌డ కొవిడ్ రూల్స్ ఎత్తేసిన ఏపీ ప్ర‌భుత్వం.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్‌..!

ఇక ప్రతి ఒక్కరి పూజామందిరంలో దొరికే కర్పూరం గురించి అందరికీ తెలిసిందే కర్పూరం నుంచి వెలువడే వాసన కీటకాలకు సరిపోదు అందుకే కర్పూరం ఎక్కువగా బల్లులు తిరిగే చోట పెట్టడం వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఇక మన ఇంట్లో అనవసరమైన కిటికీలు, అలాగే ఇంటి గోడలకు రంధ్రాలు ఉంటే అలాంటి వాటిని వీలైనంత వరకూ మూసి వేయడం మంచిది. అలాంటి వాటి నుంచి కూడా బల్లులు సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ విధమైనటువంటి చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో బల్లులు సమస్య నుంచి బయటపడవచ్చు.

Also Read: వైఎస్ వివేకా హత్య: టీడీపీలో చేరేందుకు ఆయన కూతురు రెడీ అయ్యిందా?

Recommended Video: