Ram Charan: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. కాగా ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఇందుకు ఇటీవల లీకైన రామ్ చరణ్ ఫొటోలు ఉదహరిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ క్లీన్ షేవ్‌తో ఎనబైల నాటి హెయిర్‌స్టైల్‌తో కనిపిస్తున్నాడు.
Also Read: పవన్ కళ్యాణ్, బాలయ్య, వెంకటేశ్ నట వారసుల సంగతేంటి?
దీంతో #RC15 చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్‌లో, తండ్రి పాత్రకు సంబంధించిన ఫొటో అని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా ఎనౌన్స్ చేసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఒక పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కావాలి అంటే.. కనీసం ఏడాది పడుతుంది. కానీ, శంకర్ ఇండియన్ 2 వివాదంలో ఉన్నాడు.
అలాంటిది చరణ్ తో సినిమాని శంకర్ ఎప్పుడు ఫైనల్ చేసుకున్నాడు అంటూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, చరణ్ – శంకర్ సినిమా స్క్రిప్ట్ ను డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఇచ్చాడు. కార్తిక్ చెప్పిన పొలిటికల్ కథ డైరెక్టర్ శంకర్‌కు నచ్చడంతో ఈ సినిమా సెట్ అయ్యింది. మొత్తానికి కార్తీక్ ఇచ్చిన కథతో శంకర్.. చరణ్ తో సినిమా చేస్తున్నాడు.
ఇక రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. ఐఏఎస్ అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!
Recombed Video: