Jagga Reddy Resign: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. కొద్ది కాలంగా టీఆర్ఎస్ కోవర్టుగా భావిస్తున్న ఆయన ఇక పార్టీకి టాటా చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మేరకు మీడియాకు కూడా సంకేతాలు ఇచ్చారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేస్తున్నారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పార్టీకి రాంరాం చెప్పేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. దీంతో జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ కార్యక్రమం చేపట్టినా అది ముందుకు సాగకుండా జగ్గారెడ్డి అడ్డుపుల్ల వేయడం తెలిసిందే. దీంతో నేతల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఇంకా కొద్ది రోజులైతే కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు కూడా మరిచిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గతంలో సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రచ్చబండ చేయాలని సంకల్పిస్తే తనకు చెప్పలేదనే ఉద్దేశంతో దానికి కూడా అడ్డు తగిలారు దీంతో ఆ కార్యక్రమం రూపుదాల్చలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారింది. ప్రజల్లో మరోసారి చులకన అయిపోయింది. ఇలా ఏ ప్రోగ్రాం చేసినా వెనకకు లాగడమే ధ్యేయంగా జగ్గారెడ్డి చర్యలు ఉండటంతో ఆయనపై టీఆర్ఎస్ కు కోవర్టనే అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
Also Read: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!
దీంతో కలత చెందిన జగ్గారెడ్డి పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు టీఆర్ఎస్ తొత్తుగా మారిన ఆయన ఇప్పుడు అదే పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. కానీ ఆయనను టీఆర్ఎస్ లో చేర్చుకుంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
మరోవైపు బీజేపీలో చేరతారనే వాదన కూడా వస్తోంది. కానీ ఆయన మాత్రం స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉండటానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి వెళ్లిపోవడం మంచిదే అనే అభిప్రాయం వస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిని బయటకు పంపుతుందా లేక రాజీనామా ఉద్దేశాన్ని అడ్డుకుంటుందా అని అందరిలో సంశయాలు వస్తున్నాయి.
Also Read: యాదాద్రి మహాయాగం వాయిదాకు కారణాలేంటి?
Recommended Video: