Little Investment: జీవితం మంచి పొజిషన్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఇందుకోసం ఉద్యోగం లేదా మంచి వ్యాపారం చేయాలని అనుకుంటారు. అయితే చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచన వచ్చి ప్రణాళిక బద్ధంగా వెళ్లడం ద్వారా అనుకున్న స్థితికి చేరుతారు. కానీ కొందరు నిర్లక్ష్యంగా ఉంటూ సమయాన్ని వృథా చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది సొంతంగా పనిచేయాలని అనుకుంటున్నారు. ఒకరి కింద పని చేయడం వలన ఒత్తిడి తో పాటు పని భారం ఉంటుంది. అందువల్ల సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటారు. అయితే వ్యాపారం చేయాలని అనుకుంటే ముందుగా పెట్టుబడి కావాల్సి ఉంటుంది. అనుకున్న ఆదాయం అందరి వద్ద ఉండదు. అందువల్ల వ్యాపార విషయంలో అందరూ ముందుకు రారు. కానీ తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండి లక్షలు సంపాదించే ఓ మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ కచ్చితంగా ఉంటుంది. ప్రతి పని కంప్యూటర్తో ముడిపడి నడుస్తోంది. అందువల్ల ఏ ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకున్న కంప్యూటర్ గురించి మినిమం నాలెడ్జి ఉండాల్సిన అవసరం ఉంది. వీటిలో ముఖ్యంగా సోషల్ మీడియా పై అవగాహన ఉండడం వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సోషల్ మీడియానే నడిపించే పనిని ఎంచుకోవడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. ప్రతిరోజు సరదా కోసం సోషల్ మీడియాను చూస్తాం. కానీ సోషల్ మీడియా ద్వారా ఎలా సంపాదించాలో చాలామందికి తెలియదు. అది ఎలాగంటే?
విద్యార్థుల నుంచి రాజకీయ నాయకుల వరకు సోషల్ మీడియాలో అకౌంట్ ను మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు అప్డేట్ చేస్తూ తమ గురించి చెప్పుకుంటున్నారు. వీరిలో ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే ఎప్పటికప్పుడు తాము చేసే పనులు ప్రజలకు తెలియాలని సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కొందరు రాజకీయ నాయకులు గెలుపొందిన సంఘటనలు కూడా ఇప్పటికే చూశాం. అయితే ఈ సోషల్ మీడియా నిర్వహణ చేయడానికి వారికి సమయం ఉండదు. అందువల్ల వారు కొంతమందిని నియమించుకోవాలని చూస్తాను.
సోషల్ మీడియాలో ప్రావీణ్యం ఉన్నట్లయితే వారి గురించి నిత్యం సమాచారం అప్లోడ్ చేయడానికి ఉపాధిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ తెలిసి ఉంటే మంచి క్యాప్షన్ తో పాటు తంబునెల్స్ వంటివి చేసి వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా అధికంగా డబ్బు సంపాదించవచ్చు. అయితే ముందుగా ఈ అవకాశాలు ఎవరూ ఇవ్వరు. మన ప్రావీణ్యం ఏంటో వారికి తెలియాలంటే తెలిసిన వారి వద్ద నుంచి పలువురి రాజకీయ నాయకులను కలుస్తూ ఉండాలి. అలా ఒకరి దగ్గర పనిచేసిన తర్వాత ప్రతిభ చూపిస్తే ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇలా చాలామంది తమకు వర్క్ చేయాలని అంటూ ఉంటారు. దీంతో ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ పని చేయడానికి ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పెట్టుబడి పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల కంప్యూటర్ నాలెడ్జి ఉన్నవారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు.