
Mango : పండ్లలో రారాజు మామిడి. భారతీయ జాతీయ పండుగా పేరున్న మామిడి ని ఇష్టపడని వారుండరు. మామిడికి 4000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి మాంగి ఫెరా ప్రజాతికి చెందిన వృక్షాలు. తియటి మాడిపండ్లను నేరుగా, పుల్లటి వాటిని ఊరగాయాలుగా పెట్టుకుంటారు. అవకాయ బిర్యాని ఆంధ్రాలో ఫేమస్ వంటకం. కొత్త ఊరగాయ తయారు చేసినప్పుడు దానిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఆ రుచే వేరు.
మామిడి పండును తినేటప్పుడు దాని తొక్కను తీసివేయడం సర్వసాధారణం. అందులోని గుజ్జును తింటూ ఉంటాం. ఊరగాయ చేసేటప్పుడు దీని విలువ తెలిసిన వాళ్లు తొక్కతో సహా తయారు చేస్తారు. కానీ కొందరు మాత్రం తొక్క తీసేసి లోపలి కాయతో చట్నీలను పెట్టుకుంటారు. కానీ మామిడి తొక్కతో అనేక ప్రయోజనాలున్నాయని అంటున్నారు. ఈ తొక్కల వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. మరి వాటి గురించి తెలుసుకుందాం..

మామిడి తొక్కల ద్వారా ముడుతలు పడిన చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. ఈవిషయాన్ని చెబితే ఆశ్చర్యపోతారు. కాని చాలా మంది వీటిని ఉపయోగించి ప్రయోజనం పొందారు. మామిడి తొక్కను ఎండబెట్టిన తరువాత వాటిని పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత మెత్తగా పిండివలే తయారు చేయాలి. దీనిని రోజ్ వాటర్లో కలిపి ఫేస్ పై ముడతలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. అలా చేయడం ద్వారా మోహంపై ఉన్న ముడతలు తొలిగిపోతాయి
క్యాన్సర్ సంక్రమిస్తే మరణం అనే ఒక భయం ఉండేది. కానీ దీనికి చికిత్స వచ్చిన తరువాత ఉపశమనం పొందుతున్నారు. శరీంలో మృతకణాలు పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. మామిడి తొక్కలను ఉపయోగించడం ద్వారా మృత కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. మామిడి తొక్కల్లో రాగి, ఫోలేట్ లతో పాటు విటమిన్లు A, B, B6 ఉంటాయి. వీటిని ఎరువుగా ఉపయోగిస్తే మొక్కలు బలంగా మారుతాయి. మామిడి తొక్కల్లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవిఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఫ్రీ రాడికల్స్ కళ్లు, గుండె, చర్మానికి ప్రమాదకరం. ఇవి రాకుండా మామిడి తొక్కల పౌడర్ ను తీసుకుంటూ ఉండాలి.