https://oktelugu.com/

Narendra Modi: ఎవ‌రు కాద‌న్నా.. ప్రపంచంలోనే నెం.1 లీడర్ మోడీ.. ఇంకా పెరుగుతున్న చరిష్మా..

Narendra Modi: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు. డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ ఈ విషయాన్ని తెలిపింది. దాంతో మోడీ ప్రపంచంలోనే నెం.1 లీడర్ అయిపోయారు. ఆయన చరిష్మా రోజురోజుకూ ఇంకా పెరుగుతున్నదన్న సంగతి ఈ సందర్భంగా స్పష్టమవుతోంది. డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ప్రకారంగా.. మోడీకి 71 శాతం మంది సానుకూలంగా, 21 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు. అలా ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 22, 2022 / 11:05 AM IST
    Follow us on

    Narendra Modi: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు. డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ ఈ విషయాన్ని తెలిపింది. దాంతో మోడీ ప్రపంచంలోనే నెం.1 లీడర్ అయిపోయారు. ఆయన చరిష్మా రోజురోజుకూ ఇంకా పెరుగుతున్నదన్న సంగతి ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.

    Narendra Modi

    డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ప్రకారంగా.. మోడీకి 71 శాతం మంది సానుకూలంగా, 21 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు. అలా ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 శాతానికి పైగా ఉందని తెలిపింది కంపెనీ. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు చెప్పింది. జాన్సన్‌ను చాలామంది నాయకుడిగా అభివర్ణించడం లేదని తెలిపింది. ప్రపంచ నేతలకు సంబంధించిన ప్రజాదరణను ‘మోర్నింగ్ కన్సల్ట్’ పరిశీలిస్తుంది. మోర్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి.

    Also Read: పంజాబ్ సీఎంపై మోడీ ప్రతీకారం షురూ.. తొలి దాడి..

    గతేడాది మాత్రం అనగా 2021లో మోడీ అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి వచ్చాయి. ఈ మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని పలు దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేస్తుంటుంది. బ్రెజిల్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, భారత్, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, మెక్సికో, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోంది.

    ఈ కంపెనీప్రకారం.. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది. జాన్సన్ అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 దగ్గర నిలిచిపోయింది. ఆయనను 69 శాతం మంది వ్యతిరేకించారు. అదేవిధంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ-ఇన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌లకు నెట్ నెగెటివ్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి.

    Also Read: టీడీపీతో పొత్తుపై తేల్చేసిన నరేంద్రమోడీ.. పార్టీ నేతలకు దిశానిర్ధేశం

    Tags