Street boy : న్యాయం, ధర్మం వంటి వాటికి కాలం లేదంటారు పెద్దలు. అన్యాయం రాజ్యమేలుతున్న జనరేషన్ లో, అధర్మం మితిమీరిపోతున్న సమాజంలో ఒక చిన్న పిల్లవాడి కథ వింటే ఇంకా మంచి రోజులు, మంచి మనుషులు ఉన్నారు అనిపిస్తుంటుంది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. ఓ వారం కింద ఒక దంపతులు కాశీకి వెళ్లారు. అయోధ్య, కాశీ యాత్రలో వారికి ఒక సంఘటన ఎదురు అయింది. అదేంటి అంటే..
ఒక నిరుపేద పిల్లవాడు కాశి లో పెన్నులు అమ్ముకుంటూ వారికి దగ్గరకు వచ్చి తన పెన్నులు కొనమని వేడుకున్నాడట. కానీ పెన్నులు ఎందుకులే అని లైట్ తీసుకుంటే..తాను ఉదయం నుండి టీ కూడా తాగలేదని తన దగ్గర ఒక్క పెన్
కొనమని ప్రాధేయపడ్డాడట. దానికి ఆ దంపతులు అతని పై జాలి కలిగి 20 రూపాయలు ఇచ్చి పెన్ వొద్దులే కానీ నువ్వు టీ తాగమని చెప్పిందట. దానికి ఆ పిల్లవాడు నిరాకరించి తన వద్ద ఉన్న పెన్నులను కొనమని చెప్పాడట. సరే పెన్నులు వద్దని.. కానీ టిఫిన్ తినిపిస్తామని పిలిచారట.
కానీ ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు సమాజం ఎంత కలుషితం అవుతుందో కూడా అర్థం అవుతంది. మరి ఆ అబ్బాయి చెప్పిన సమాధానం తెలుసుకోండి. తాను పని చేయకుండా ఎవరి వద్ద ఫ్రీగా తీసుకోను అని.. అలా తీసుకోవడం తప్పని.. ఉచితంగా ఎవరు ఏమి ఇచ్చిన తీసుకోకూడదని తన తల్లి చిన్నప్పటి నుంచే నేర్పించిందట. నిజానికి ఆ పిల్లవాడు పేదవాడు అయినా కూడా పని చేయకుండా భోజనం కూడా చేయను అన్నాడు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో కనిపిస్తాయి కానీ నిజజీవితంలో కష్టమే కదా.
అయితే ఈ పిల్లవాడి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్. కానీ కాశీలో స్థిరపడ్డారట. ఈ పిల్లవాడిని మాత్రమే కాదు తనను కన్న తల్లిదండ్రులకు కూడా సలామ్ అని చెప్పాల్సిందే. కష్టపడకుండానే, ఇతరులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న ఈ కాలంలో పొట్ట కోసం 20 రూ. కూడా వద్దు అన్న ఆ పిల్లవాడి మనస్తత్వానికి సలామ్ కొట్టాల్సిందే.