Husband – Wife : పెళ్లి అంటే ఒక గొప్ప అనుభూతి. రెండు జీవితాలు, రెండు మనుషులు, రెండు గుండెలు కలిసి ఒకటిగా బతికినప్పుడు ఆ ఇద్దరి జీవితం ఒకరిగా బాగుంటుంది. అంతేకాదు సంతోషంగా ఆ సంసారం కూడా సాగుతుంది. కానీ ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న గొడవలకే కోపాలు అంటూ గొడవలు అంటూ విడిపోతున్నారు. దూరం అవుతున్నారు. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. వేరొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కలిసి ఉండేవారు తక్కువే ఉంటున్నారు. అయితే భార్యభర్తలు విడిపోవద్దు అంటే ఎలా ఉండాలంటే..
ఒకే సంసారం, ఒకే కుటుంబం అనుకుంటే ఏ భార్యభర్తలు కూడా విడిపోరు. ఇలా విడిపోవాలి అంటే మీరిద్దరు ఒకరు కాదు వేరు అనుకోవాలి. అందుకే సంసారం, బాధ్యతలు అన్నీ ఇద్దరివి కాదు ఒకరివే అనుకోవాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఈ క ష్టం ఇద్దరిది కాదు ఒకరిదే అనుకోవాలి. సంతోషం అయినా సరే ఒకరిదే అనుకోవాలి. నీ జీవితం నీది, నా జీవితం నాది అంటూ గడిపేస్తుంటే ఎలాంటి రిలేషన్ అయినా సరే కలిసి ఉండటం కష్టమే.
ఎక్కడో పుట్టి ఒక చోటున కలిసి రెండు జీవితాలను ఒక జీవితంలాగా కలిసి సాగించాలి. ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఎంతటి కష్టం వచ్చినా సరే కలిసి పరిష్కరించుకోవాలి. ఎదుటి వారికి చులకన అవకుండా భార్యభర్తలు అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా బతకాలి. పరమాన్నం తినకపోయినా కారం మెతుకులను కలిసి తింటేనే ఆ ఇంట్లో సంతోషం తాండవిస్తుంటుంది. డబ్బు, జలసాలు, షికార్లలో మాత్రమే ప్రేమ లేదు.. కలిసి మెలిసి కబుర్లు చెప్పుకుంటూ కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కలిసి ఒకరిగా బతికితేనే సంతోషం అని నమ్మాలి. అప్పుడే మీరు ఇద్దరు కాదు ఒకరు అని.. ఒకరి కోసం ఒకరు బతకాలి అనిపిస్తుంటుంది.