OTT releases : ఈ వారం ఓటీటీ లోకి వస్తున్న సూపర్ హిట్ చిత్రాలు ఇవే… ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

. విక్రమ్ హీరోగా, సదా హీరోయిన్ గా వచ్చిన అపరిచితుడు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ మరోసారి మే 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Written By: NARESH, Updated On : May 14, 2024 10:13 pm

Super hit movies coming to OTT this week

Follow us on

OTT releases : ఈ వారం థియేటర్ ఇంకా ఓటిటీ లో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. ` ఈ సమ్మర్ లో కొన్ని చిన్న సినిమాలు ధియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా పరిచయం అవుతున్న తెరకెక్కిన సినిమా రాజు యాదవ్ . ఈ చిత్రంలో అంకిత కరత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎమోషనల్ కామెడీ థ్రిల్లర్ కాగా రాజు యాదవ్ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రంగస్థలం మహేష్, సుదర్శన్, ఇనాయ సుల్తానా కీలక పాత్రల్లో నటించిన కామెడీ మూవీ నటరత్నాలు. ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. మరో చిత్రం దర్శిని. దర్శిని మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కింది. ఈ చిత్రం మే 17 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. హారర్ సినిమా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. సాయి హర్షిని, యస్వీ రమణ, కేవీ రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 17న విడుదల అవుతుంది.

ఇక ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అపరిచితుడు రానుంది. విక్రమ్ హీరోగా, సదా హీరోయిన్ గా వచ్చిన అపరిచితుడు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ మరోసారి మే 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఓటిటీ విషయానికొస్తే .. ఆహా లో మే 17న విద్య వాసుల అహం అనే సినిమా నేరుగా ఓటీటీ లోకి రానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

బాహుబలి – క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్- మే 17
క్రాష్ కొరియన్ సినిమా -మే 14
కల్వన్ -మే 15

జియో సినిమా
జర హట్కే జర బచ్కే -మే 17

అమెజాన్ ప్రైమ్
అవుటర్ రేంజ్ సీజన్ 2 హాలీవుడ్ సిరీస్ -మే 16

జీ 5
బస్తర్- మే 17

నెట్ఫ్లిక్స్
ఏ ప్లే మాడిసన్ హాలీవుడ్ సిరీస్- మే 15
బ్రిడ్జర్టన్ సీజన్ 3 హాలీవుడ్ సిరీస్ -మే 16
మేడం వెబ్ హాలీవుడ్ సిరీస్- మే 16
ది 8 షో కొరియన్ సిరీస్ -మే 17

సోనీ లివ్
లంపన్ మరాఠి సిరీస్- మే 17
ఎంఎక్స్ ప్లేయర్ .. ఎల్లా హిందీ -మే 17

బుక్ మై షో
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ స్ట్రీమింగ్ అవుతుంది.