Ben Stokes- Sunrisers Hyderabad: ఐపీఎల్ పండుగకు అంతా సిద్ధమవుతోంది. ఫ్రాంచైజీలు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందకు రెడీ అవుతున్నాయి. తమకు నచ్చిన ఆటగాళ్లను తీసుకుని మిగతా వారిని రిటన్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను తప్పించింది. సత్తా గల ఆటగాళ్లను తీసుకుని విజయాలు సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సమర్థులైన వారిని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. విదేశీ స్టార్ ఆటగాళ్లను చేజిక్కించుకోవాలని ఎదురు చూస్తున్నాయి.

ఫామ్ లో ఉన్న ఆటగాళ్లపై గురిపెడుతున్నాయి. సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, సికిందర్ రజా, కెమరూన్ గ్రీన్, అలెక్స్ హిల్స్, ఆదిల్ రషీద్ లను తమ జట్టులోకి తీసకోవాలని ఆసక్తి చూపుతున్నాయి. పది ఫ్రాంచైజీల్లో ఎక్కువ డబ్బు ఉన్న సన్ రైజర్స్ వద్ద రూ.42 కోట్లు ఉండటంతో స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వేలం దగ్గర పడుతున్న కొద్దీ ఆటగాళ్లలో కూడా ఆందోళన పెరుగుతోంది. తమను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. టెన్ స్టోక్స్ ను వేలంలో దక్కించుకుని అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. అతడికి ఎంత డబ్బు అయినా చెల్లించి తమ జట్టుకు మంచి బలం చేకూర్చాలని చూస్తోంది.
సన్ రైజర్స్ దగ్గర డబ్బు ఎక్కువ ఉండటంతో మంచి ఆటగాళ్లను తీసుకుని విజయాలు సాధించాలని తాపత్రయపడుతోంది. నెంబర్ వన్ ఆటగాళ్లతో టీంను సమర్థవంతంగా తయారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ్ సుిత్, రొమారియో పెపర్డ్, ప్రియమ్ గార్డ్, రవికుమార్ సమర్థ్, సౌరబ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్, శ్రేయాస్ గోపాల్ లను దూరం పెట్టింది. జట్టును ముందుకు నడిపించే వారినే తీసుకోవాలనే భావనకు వచ్చింది.

విలియమ్సన్ ను దూరం చేసుకున్నా అతడు మావాడే అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టడంతో అతడిని మళ్లీ తీసుకుంటారేమోననే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న జరగనుంది. డిసెంబర్ 15 వరకు ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. దీంతో ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను దక్కించుకుని విజయం దక్కించుకోవడానికి మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఫ్రాంచైజీలు త్వరలో జరిగే ఐపీఎల్ లో సత్తా చాటాలని ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.


