ED IT Raids And SIT: తెలంగాణలో ఆధిపత్య రాజకీయ, ప్రతీకార చర్యలు చూస్తుంటే ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయో.. ఎవరి కొంప ముగునుగుతుందో అన్న ఆందోళన అటు టీఆర్‌ఎస్.. ఇటు బీజే పీ నేతల్లో వ్యక్తమవుతోంది. మంత్రి గంగుల కమలాకర్‌పై ఈడీ దాడులు, క్యాసినో కేసులో మంత్రి తలసాని సోదరులు, మంత్రి పీఏ హరీశ్ విచారణ, తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు, మరోవైపు లిక్కర్ స్కాం దర్యాప్తు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్‌కు సిట్ నోటీసులు, బీజేపీ నాయకులకు నోటీసులు, మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై వాణిజ్య పన్నుల శాఖ దాడులు.. కేసులతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం..
కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేస్తున్న కేసుల్లో నేరం ఉందో లేదో ఎవరికీ తెలియదు. దోషులు ఎవరు.. నిర్దోషులు ఎవరు అనేది దర్యాప్తు సంస్థలే నిర్ణయించాలి. కానీ తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలతో ప్రతీకార దాడులు జరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఎన్ని కేసులు నమోదైనా కొన్నేళ్ల తర్వాత అవన్నీ వీగిపోతాయి. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. కానీ అవన్నీ ఇప్పుడు మనుగడలో లేవు. తాజాగా బీజేపీ దర్యాప్తు సంస్థల దాడులు పెంచింది. దీంతో తామేమీ తక్కువ అన్నట్లు టీఆర్‌ఎస్ సర్కార్ తన దర్యాప్తు సంస్థలతో జాతీయ నేతలపైనే గురిపెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బ్లాక్‌మెయిల్ కోసం..
తాజాగా పరిణామాలను చూస్తుంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం కోసం దర్యాప్తు సంస్థలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది. ఇలాంటి చర్యలతో దర్యాప్తు సంస్థలు కూడా క్రెడిబులిటీ కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ప్రజల విశ్వాసం కోల్పోతో దర్యావ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు ఎప్పటికీ మంచిది కాదని పేర్కొంటున్నారు. దర్యాప్తు సంస్థలే దారి తప్పితే.. రాబోయే రోజుల్లో పూర్తిగా కక్షసాధింపు కోసమే వాడుకునే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.