
Corona Virus: కరోనా పుట్టిల్లు చైనా వైరస్ ప్రభావానికి గురవుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో నిబంధనలు కఠినతరం చేశారు. సోమవారం ఒక నగరంలో లాక్ డౌన్ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. వాయువ్య ప్రావిన్స్ గన్సుకు చెందిన ప్రావిడెన్సియల్ రాజధాని లాస్ జౌలో ఆరు కసులతో సహా 29 దేశీయ ఇన్ ఫెక్షన్ లు బయట పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి పై ఆందోళన చెందుతోంది.
చైనాలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయం నెలకొంది. మంగోలియాలోని ఐజిన్ కౌంటీలో లాక్ డౌన్ ప్రకటించారు. ఐజిస్ జనాభా 35,700. దీంతో కొవిడ్ ఆంక్షలు విధించారు. ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు కరోనా వైరస్ నిర్మూలనలో అందరు కలిసి రావాలని సూచిస్తోంది.
చైనా ఆరోగ్య కమిషన్ సూచించిన లెక్కల ప్రకారం 11 స్టేట్లలో కరోనా వేగంగా విస్తరిస్తోందని తెలుస్తోంది. చైనాలో సోమవారం 38 కేసులు వెలుగు చూడటంతో చైనా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. బీజింగ్ లో కూడా 12 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. లాక్ డౌన్ విధిస్తూ వైరస్ ను కట్టడి చేసే పనిలో నిమగ్నమవుతున్నారు.
బీజింగ్, మంగోలియా, గాన్సు, నింగ్జియా, గుయిజౌలా తదితర ప్రాంతాల్లో కొవిడ్(Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. వ్యాధి తీవ్రత తగ్గే వరకు ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. కరోనా వైరస్ పై సమరం సాగించేందుకు చైనా పలు మార్గాలు అన్వేషిస్తోంది.
Also Read: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే?