Mahesh Manjrekar: ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ క్యాన్సర్‌ను జయించారు. ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్ , డాన్ శీను, గుంటూర్ టాకీస్ , అఖిల్, వినయ విధేయ రామ, సాహో , వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. అలానే తెలుగుతో పాటు హింది, తమిళ్, మరాఠి , బెంగాలీ, ఇంగ్లిష్ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన అంతిమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇటీవల అంతిమ్ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలోనే మహేశ్ ఈ విషయాన్ని తెలిపారు. అంతిమ్ చిత్ర షూటింగ్ సమయంలో క్యాన్సర్ బారిన పడ్డానని వెల్లడించారు. ఈ విషయం తెలియగానే షాక్ అవ్వలేదని… చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. దానితో పోరాడుతూ జీవనం సాగిస్తున్నారని తాను కూడా మనోధైర్యంతో ఉన్నట్లు తెలిపారు. అలానే తన మీద క్యాన్సర్ పెద్దగా ప్రభావం చూపలేదని… కీమోథెరపీ చికిత్స తీసుకుంటూనే అంతిమ్ చిత్రీకరణను పూర్తి చేశానని మహేశ్ అన్నార
క్యాన్సర్ ను జయించడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. హిందీలో ‘వాంటెడ్’, ‘రెడీ’, ‘ఓ మై గాడ్’ సహా ఎన్నో చిత్రాల్లో నటించారు మంజ్రేకర్. అలానే ‘వాస్తవ్’, ‘కురుక్షేత్ర’, ‘నటసామ్రాట్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ వార్తతో పలువురు సినీ ప్రముఖులు ఆయనను అభినందిస్తున్నారు. ఈ వ్యాధినైనా ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని మనోధైర్యంతో ఉంటే దేనినైనా సాధించగలం అని చెబుతున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ పలువురు నెటిజన్లు ఆయనకు మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారు.