Corona Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 11,65,006 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 26,041 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. కేరళలో 15,951, మహారాష్ట్రలో 3,206 కేసులు వెలుగుచూశాయి. తాజాగా మరో 29వేల మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.36 కోట్లకు చేరగా రికవరీలు 3.29 కోట్లకు పెరిగాయి. రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది.
ప్రస్తుతం క్రియాశీల కేసులు మూడు లక్షల దిగువకు చేరాయి. ఈ కేసుల సంఖ్య 2.99 లక్షలు. నిన్న 276 మంది మరణించారు. దాంతో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4.47 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. తాజా కేసులు తగ్గుతుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య కూడా 3 లక్షల దిగువకు పడిపోయింది. మృతుల సంఖ్య 300 లోపే నమోదైంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన ఈ గణాంకాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది.
ఆదివారం సెలవు కావడంతో పంపిణీ టీకా డోసుల సంఖ్య కాస్త తగ్గింది. నిన్న 38.18 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 86 కోట్ల టీకాలు పంపిణీ చేశారు. ఏపీలో కరోనా కేసులు నమోదవుతూపే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,184 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 58,545 మందికి నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్క రోజు కరోనా కారణంగా 11 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కొత్త కేసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.