Taj Mahal : ఉదయపూర్‌లోని జగ్ నివాస్ టెంపుల్ ప్యాలెస్ గురించి వినే ఉంటారు. ఇది పిచోలా సరస్సు మధ్యలో ఉంది . దాని అందం పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఈ ప్యాలెస్ ఎంతో గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బోటింగ్‌తో విందును ఆస్వాదించడానికి చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడికి వెళ్లాలంటే టికెట్ ధర రూ.175 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఉదయపూర్ నగరం సందర్శించడానికి అనేక ప్రత్యేక ప్రదేశాలను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి పిచోలా సరస్సు.
ఈ సరస్సు లోపల నిర్మించిన జగ్ నివాస్ మందిర్ ప్యాలెస్ మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇది చూసిన తర్వాత, మీరు కూడా ఉదయపూర్ అందానికి అభిమాని పక్కా అవుతారు. ఈ ప్యాలెస్ ఉదయపూర్‌లోని అత్యంత అందమైన ప్యాలెస్‌లలో ఒకటి. ఇక్కడ వివాహాలు కూడా చాలా జరుగుతాయి. ఉదయపూర్ లోని సరస్సులు , చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. షాజహాన్ కూడా మేవార్‌కు ఆశ్రయం పొందేందుకు వెళ్ళారట. అప్పుడే ఈ ఉదయపూర్‌లోని జాగ్ దేవాలయం అందాలను చూసి ఆశ్చర్యపోయి, దాని నుంచి స్ఫూర్తి పొంది తాజ్ మహల్‌ను నిర్మించాడట.
పిచోలా సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఈ ప్యాలెస్ ను నిర్మించారు. దీనిని 1747లో మహారాణా జగత్ నిర్మించారు. సరస్సు మధ్యలో ఉండడం వల్ల చుట్టూ నీరు ఉంటుంది. దీంతో దాని అందం మరింత పెరుగుతుంది. రాజభవనం 17వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో షాజహాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ ఖుర్రం కోసం కట్టారు. అయితే దీన్ని మహారాజ్ కరణ్ సింగ్ నిర్మించారు. ఇది వారు రహస్యంగా ఉండటానికి నిర్మించారు. మహారాజా కరణ్ సింగ్ ఈ ప్రాంతాన్ని పాలించేవాడు . ఈ కాలంలో ప్రిన్స్ ఖుర్రం తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటును విరమించుకున్నాడు. షాజహాన్ ఇక్కడ ఉన్న సమయంలో తాజ్ మహల్ నిర్మించడానికి ప్రేరణ పొందాడని నమ్ముతారు.
మీరు ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెస్ ఎదురుగా ఉన్న బన్సీ ఘాట్ నుండి పడవలో జాగ్ మందిర్ చేరుకోవచ్చు. ఇక్కడ రాజభవనాన్ని సులభంగా సందర్శించవచ్చు . రాత్రి భోజనం కూడా ఇక్కడ చేసి ఆనందించవచ్చు. రాత్రి భోజనం చేయాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి. ఈ ద్వీపానికి టిక్కెట్లు తీసుకోవాలి. ఉదయపూర్ సిటీ ప్యాలెస్ గేట్ నుంచి వాటిని కొనుగోలు చేయవచ్చు.
ఇక్కడికి వెళ్లేందుకు టిక్కెట్ ధర 175 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. సాధారణ బోటింగ్ కు పిల్లలకు రూ.150, పెద్దలకు రూ.700. సూర్యాస్తమయం చూసేందుకు పిల్లలకు టిక్కెట్టు రూ.300. ఈ మందిరాన్ని దర్శంచుకున్న తర్వాత దాని అందానికి ముగ్దుడైన షాజహాన్.. యమునా నది ఒడ్డున తాజ్ మహల్ కట్టించాడని తెలుస్తుంది.