Railway Bogies: మన దేశంలో రైల్వే వ్యవస్థను ప్రజలు బాగా ఉపయోగించుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు రైల్వే శాఖ ట్రైయిన్స్ ను నడపలేదు. కానీ, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రైళ్లలో రద్దీ పెరిగింది. ప్రయాణికులు రైలులో ప్రయాణించేందుకుగాను మునుపటిలాగానే ఆసక్తి చూపుతున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే..భారతీయ రైల్వే వ్యవస్థ ట్రెయిన్స్ నడిపే క్రమంలో ప్రత్యేకమైన సైన్ లాంగ్వేజ్ వాడుతుంది. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అయితే, మనం రైలులో ప్రయాణించేందుకు వెళ్తున్న క్రమంలో బోగీలకు ఉండే గీతలు చూస్తుంటాం. కానీ,వాటిని పెద్దగా పట్టించుకోం. ఇంతకీ ఆ గీతలు ఎందుకు వేస్తారు? అవి ఏమని సంకేతాలు ఇస్తాయి? అనేది తెలుసుకుందాం.

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రతీ రోజు కొన్ని వేల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. ఇకపోతే ఈ భారతీయ రైల్వే వ్యవస్థ పనితీరును ప్రతీ భారతీయుడు మెచ్చుకుంటాడు కూడా. కాగా, లోకో పైలట్ లకు తమదైన సంకేతాలను ఇచ్చేందుకుగాను రైలు బోగిలపైన ప్రత్యేకమైన సైన్ లాంగ్వేజ్ ను రైల్వేశాఖ వారు ఉపయోగిస్తారు.
సాధారణ ప్రజలకు ఈ ప్రత్యేకమైన సంకేతాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, రైల్వే శాఖలో పని చేసే ప్రతీ ఉద్యోగికి రైల్వే బోగిలపై ముద్రించే గీతల అర్థం దాదాపుగా తెలిసి ఉంటుంది. అయితే, ప్యాసింజర్స్ కు వీటి గురించి పెద్దగా అవగాహన అయితే ఉండబోదు.
Also Read: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!
1951లో రైల్వే వ్యవస్థను జాతీయం చేసిన సంగతి అందరికీ దాదాపుగా విదితమే. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రైల్వే సంస్థగా భారతీయ రైల్వే వ్యవస్థకు పేరుంది. రైలులో సామాన్యులు ప్రయాణించేందుకు వీలుగా చార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి. మనం ప్రయాణిస్తున్న ట్రెయిన్ బోగిలపైన ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగు గీతలను మనం గమనించొచ్చు. వాటికి సెపరేట్ మీనింగ్ ఉంటుంది.
రైలు బోగిలపై వైట్ కలర్ కనిపిస్తే ఆ బోగిలు నాన్ రిజర్వ్ డ్. కాగా, వీటిలో ఎవరైనా ప్రయాణించొచ్చు. ఇకపోతే యెల్లో కలర్ లైన్స్ ఉన్న బోగిలను స్పెషల్ కోచ్ లుగా పేర్కొంటారు. ఇందులో దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న వారు ప్రయాణిస్తారు. వారి కోసం ఆ బోగిలను కేటాయిస్తారు. ఆకుపచ్చ, నలుపు రంగు గీతలు ఉంటే కనుక ఆ బోగిలు మహిళ కోసం ప్రత్యేకంగా కేటాయించబడినవి అని అర్థం చేసుకోవాలి.
Also Read: ఆర్ఆర్ఆర్ రాజీనామా వెనుక అసలు కారణమిదే…!
For LIVE News, National Updates, India News Watch:
[…] Anupama Parameswaran: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. సోషల్ మీడియాలో ఇటీవల భిన్నమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అనుపమ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అనుపమ రీసెంట్‌గా కడుపుతో ఉన్నట్లుగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే 2020లో నటించిన ”మనియారాయిలే అషోకన్” అనే మలయాళం సినిమాలో ప్రెగ్నెంట్‌గా నటించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది. […]