Dowry Crime: కట్నం తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ ఇప్పటికీ ప్రతి ఒక్కరూ పెళ్లి సమయంలో లక్షల విలువచేసే కట్న కానుకలను తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మరికొందరు పెళ్లి సమయంలో సమర్పించిన కట్నకానుకలు సరిపోలేదని అదనపు కట్నం కోసం ఎంతో మంది యువతులను వేధించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక వరుడు పెళ్లి కాకుండానే కట్నం డబ్బులతో పరారైన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: పిల్లలు ఎందుకు ఏడుస్తారు.. ఏడుపు ఆపాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వరుడు న్యాయవాది మాణిక్‌రెడ్డి అనే వరుడికి కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన వధువు సింధురెడ్డితో ఈనెల 12వ తేదీ వివాహం నిశ్చయం చేశారు.అయితే ముందుగానే పెళ్లి సమయంలో వధువు కుటుంబసభ్యులు సమర్పించాల్సిన కట్నకానుకలు ముందుగానే వరుడి కుటుంబానికి అందించారు. అయితే ఈ కట్నకానుకలు అందుకున్న మాణిక్ రెడ్డి సదరు యువతిని వివాహం చేసుకోకుండా కట్నం డబ్బులతో పరారయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న వధువు సింధు రెడ్డి తన మాదిరి మరి ఎవరూ మోసపోవద్దని రూరల్ పోలీస్ స్టేషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తనకు న్యాయం జరగాలని న్యాయ పోరాటానికి దిగింది. ఇలా మూడు రోజుల పాటు తన కోసం న్యాయపోరాటం చేయగా వరుడుని పట్టుకొని యువతితో పెళ్లికి ఒప్పించినట్లు ఎస్‌ఐ సుభాష్ వెల్లడించారు.
Also Read: హనీమూన్ ప్లాన్ చేసిన నూతన జంట.. అయితే భర్త ఇచ్చిన ట్విస్ట్ చూసి షాక్ అయిన భార్య?