Tollywood Industry Highlights: తెలుగు చిత్ర పరిశ్రమను 2020 సంవత్సరం తీవ్రంగా దెబ్బ తీసింది. కరోనా మహమ్మారి ఎప్పుడైతే దేశంలోకి అడుగుపెట్టిందో అప్పటి వరకు ఎంతో హాయిగా గడచిన జీవితాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. కూలీల నుంచి పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారు సైతం మళ్లీ ఒక్కసారిగా ఎక్కడైతే తమ జీవితాలను ప్రారంభించారో అక్కడకు చేరుకున్నారు. ఇక సినిమా పరిశ్రమ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సినిమాలు లేకపోవడంతో పని కరువై కార్మికులు తిండికి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా సినిమాలు నిర్మాణ దశలోనే ఆగిపోవడంతో నిర్మాతలు కూడా చాలా నష్టపోవాల్సి వచ్చింది.
Also Read: Sitara Krishna: సూపర్ స్టార్ తాతతో మహేష్ బాబు కూతురు లంచ్ డేట్
2020తో పోలిస్తే 2021లో మధ్య భాగం నుంచి చాలా సినిమాలు థియేటర్లకు ముందుకు వచ్చాయి. ఒకటో రెండో సినిమాలు మాత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను నమ్ముకున్నాయి. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కొన్ని బాక్సీఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందులో కుర్రహీరోల సినిమాలే కాకుండా మీడియం రేంజ్‌తో పెద్ద హీరోల సినిమాలు సైతం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హీరో బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇక హీరో నితిన్ ‘చెక్’ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. హీరో శ్రీ విష్ణు ‘గాలి సంపత్’ సినిమాతో గాలి తీసేసుకున్నాడు. అదే విధంగా కార్తీకేయ హీరోగా వచ్చిన ‘చావుకబురు చల్లగా’ పెద్దగా రాణించలేకపోయింది. రానా నటించిన ‘అరణ్య’ మూవీ అట్టర్ ప్లావ్ అయ్యింది. హీరో సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్యాస్ లేని సోడాగా మిగిలిపోయింది. నాని హీరోగా వచ్చిన ‘టక్ జగదీశ్’ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఇదే ఏడాదిలో నితిన్ ‘మ్యాస్ట్రో’ సినిమాతో మరో ప్లాప్ అందుకున్నాడు. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ అంచనాలకు అందుకోలేకపోయింది. చాలా కాలం తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ‘మహాసముద్రం’ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. చివరగా ‘మంచి రోజులు వచ్చాయి’, ‘అనుభవించు రాజా’ , ‘స్కై లాబ్’, ‘గమనం’ వంటి సినిమాలు కూడా గాలిలో కలిసిపోయాయి.
Also Read: Hero Nani: ‘సింహంలా ఉన్నావ్ నాన్న’ అంటూ నానికి కొడుకు బిరుదు.. నెట్టింట్లో వీడియో వైరల్