Fancy vehicle numbers craze: వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు కావాలని కొందరు ఆరాటపడుతూ ఉంటారు. ఈ నెంబర్ల కోసం లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉంటారు. కొందరు తమకు లక్కీ నెంబర్ ఉండాలని అనుకుంటూ.. మరికొందరు ఫ్యాన్సీ గా ఉండాలని కోరుకుంటూ ఈ నంబర్లకు అత్యధికంగా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. తాజాగా వేలం వేసిన నంబర్లపై హైదరాబాదులోని ఖైరతాబాద్ రవాణా శాఖ రూ. 63 లక్షల ఆదాయాన్ని పొందింది. అలాగే మరో రెండు నెంబర్ల నుంచి భారీగా డబ్బులు వచ్చాయి. ఈ వేలం వివరాల్లోకి వెళితే..
ఫ్యాన్సీ నెంబర్లకు నిత్యం క్రేజీ ఉంటుంది. దీంతో కొన్ని ప్రత్యేక నెంబర్లను రవాణా శాఖ మన సందర్భాల్లో వేలం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12న ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో చాలామంది పోటాపోటీగా పాల్గొన్నారు. ఒక్క రోజులోనే ఈ వేలం ద్వారా రూ.63,77,361 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఈ వేళలో అత్యధికంగా TG 09 J 9999 అనే నెంబర్ వేలం వేయగా.. హెటేరో డ్రగ్ కంపెనీ రూ.25,50,200 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ నెంబర్ మీద వచ్చిన అత్యధిక బిడ్ మీరు మాత్రమే వేశారు. అలాగే మనో మరో నెంబర్ TG 09 J 9990 అనే నెంబర్ను అశ్వక్ జహీర్ రూ.1.22 లక్షలకు కొనుగోలు చేశారు. ఇంకో నెంబర్ TG09 H0009 అనే నెంబర్ను ARL టైర్స్ రూ.6,50,009 కు కొనుగోలు చేశారు. అలాగే TG 09 J 0001 అనే నెంబర్ను రాజేశ్వరి స్కిన్ అండ్ హెయిర్ కేర్ సెంటర్ రూ.6,25,999 కి కొనుగోలు చేశారు. ఈ విధంగా మొత్తం ఖైరతాబాద్ రవాణా శాఖకు రూ.63,77,361 ఆదాయం వచ్చింది.
దీంతో ఫ్యాన్సీ నెంబర్లపై ఎంత క్రేజీ ఉందో అర్థం చేసుకోవచ్చని కొందరు చర్చించుకుంటున్నారు. అలాగే కొందరు తమకు అదృష్టం కలగాలని ఆల్ 9 నెంబర్స్ ను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నెంబర్ ఈసారి హెటేరో డ్రగ్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఇంకొంతమంది సీరియల్ గా ఉండాలని కూడా నెంబర్ల కోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ప్రతి సారి వేలంలో సాధారణ ఆదాయం వచ్చినప్పటికీ… ఈసారి మాత్రం ఊహించని దానికంటే ఎక్కువగా రాబడి వచ్చినట్లు రవాణా శాఖ తెలుపుతుంది.