OG Guns and Roses Song: మరో 12 రోజుల్లో టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ మూవీ ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ని మేకర్స్ ఇంకా ప్రారంభించలేదని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే లేట్ గా ప్రొమోషన్స్ ని ప్రారంభించినా లేటెస్ట్ గా ఉంటుందని, ఫ్యాన్స్ కి మెంటలెక్కిపోయే రేంజ్ అప్డేట్స్ ఇక నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయని అంటున్నారు. ముందుగా 15 వ తేదీన ఒక పాట ని విడుదల చేస్తారట. ‘గన్స్ & రోజెస్’ అంటూ సాగే పాట ఫైర్ స్ట్రోమ్ పాట కంటే పెద్ద హిట్ అవుతుందని, సినిమా హైప్ ని మరింత పెంచేలాగా ఈ పాట ఉంటుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందని టాక్. అదే విధంగా వైజాగ్ లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారట. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తరళి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంటర్వ్యూస్ కూడా భారీ గానే ప్లాన్ చేశారట. దీనికి కూడా ఒక షెడ్యూల్ ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం యూత్ లో యానిమీస్ కామిక్ బుక్స్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓజీ కి సంబంధించి కూడా ఒక కామిక్ బుక్ ని సిద్ధం చేశారట. ఈ వారం లోనే దానిని విడుదల చేసే అవకాశం ఉంది.
ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ మొత్తం నిన్ననే పూర్తి చేశారట మేకర్స్. మొదటి కాపీ సిద్ధమైందని, సెన్సార్ కి కూడా దరఖాస్తు చేసుకున్నారని, ఈ మంగళవారం రోజున సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని టాక్. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే 15 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు అనుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకముందే ఓవర్సీస్ మొత్తం మీద 70 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. పూర్తి స్థాయి బుకింగ్స్ మొదలయ్యాక ఓవర్సీస్ మొత్తానికి కలిపి 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 21 నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.