Ravi Teja daughter: మాస్ మహా రాజా గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ…ఈయన చేసిన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రవితేజ మాత్రం కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పటికే ఆయనకి చాలా మంచి మార్కెట్ అయితే ఉంది… ప్రస్తుతం ఆయన మాస్ జాతర అనే సినిమా చేశాడు ఈ సినిమా తొందర్లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో మరికొన్ని సినిమాలు కూడా కమిట్ అవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే రవితేజ కూతురు విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ అవుతోంది… హీరోయిన్లను మించిన అందంతో తను ఉందని చాలామంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న ‘ ఆన్ స్టాపబుల్’ షో కి రవితేజ గెస్ట్ గా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ షోలో రవితేజ కూతురు ఒక వీడియో బైట్ అయితే ఇచ్చింది. అందులో రవితేజ గురించి చాలా గొప్పగా చెప్పింది.
ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రవితేజ కి హీరోయిన్స్ ను మించిన అందంతో ఒక కూతురు ఉందని ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయితే మాత్రం ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరు పక్కకు తప్పుకోవాల్సిందే అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…
Also Read: ఓజీ – ఓమి ఇద్దరు అన్నదమ్ములా… ఇదేం ట్విస్ట్ సామి…స్టోరీ మొత్తం లీక్ అయిందిగా…
మరి ఏదేమైనా కూడా రవితేజ తన కూతురు ను హీరోయిన్ గా తీసుకొచ్చేఉద్దేశ్యంలో లేనట్టుగా తెలుస్తోంది. తన కొడుకును మాత్రం హీరోగా పరిచయం చేస్తానని ఆయన పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక దానికి తగ్గట్టుగానే రవితేజ కొడుకు ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఇక వీలైనంత తొందరగా తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా తన కొడుకు విషయం పక్కన పెట్టి అందరు తన కూతురు గురించి మాట్లాడుతుండడం విశేషం… ఇక రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం రవితేజ కూతురు గురించి డిస్కస్ చేస్తూ ఉండడంతో ఆమె అందాన్ని చూడడానికి చాలామంది ఆమె ఫొటోస్ ని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు…