Homeక్రీడలుTeam India New Jersey- Asia Cup 2022: ఆసియా కప్ కోసం కొత్త...

Team India New Jersey- Asia Cup 2022: ఆసియా కప్ కోసం కొత్త జెర్సీతో టీమిండియా.. అదిరిపోలా..

Team India New Jersey- Asia Cup 2022: టీమిండియా ఆసియా కప్ కోసం యూఏఈ వెళ్లింది. ఇందులో పాల్గొనేందుకు ఆరు జట్లు వచ్చాయి. దీంతో ప్రాక్టీసు మొదలు పెట్టాయి. రేపటి నుంచి ఆసియా కప్ మ్యాచులు మొదలవుతున్నాయి. దీంతో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే ప్రాక్టీసు చేస్తోంది. టీమిండియా జట్టుకు కొత్త జెర్సీ అందించారు. దీంతో వీటితో టీమిండియా ఆల్ రౌండర్ ఓ ఫొటోను నెట్టింట్లో పెట్టి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇన్నాళ్లు ఎప్పుడు కూడా అలా కొత్త జెర్సీని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన సంఘటనలు లేవు. కానీ ఈసారి మాత్రం ఆటగాళ్లు కొత్త జెర్సీతో కనిపించడం సంచలనం కలిగిస్తోంది.

Team India New Jersey- Asia Cup 2022
Team India New Jersey- Asia Cup 2022

ఆసియా కప్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. యూఏఈలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసియా కప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. దీంతో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొత్త జెర్సీతో ఉన్న జట్టు ఫొటోను షేర్ చేశాడు. పాకిస్తాన్ కూడా కొత్త జెర్సీతో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ఐసీసీ ప్రతి టోర్నమెంట్ లో కొత్త జెర్సీలను అందజేయడం మామూలే. దీంతో ఇప్పుడు కూడా ఆసియా కప్ కోసం కొత్త జెర్సీని అందించింది. రవీంద్ర జడేజా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త జెర్సీతో ఉన్న ఫొటోను పంచుకోవడం తెలిసిందే.

Also Read: Anasuya Bharadwaj: లైగర్ మూవీ ఫ్లాప్ అవ్వడం తో సంబరాలు చేసుకుంటున్న యాంకర్ అనసూయ

భారత జట్టు కొత్త జెర్సీ నీలం రంగులో ఉంది. ఆసియా కప్ లో టీమిండియా కొత్త జెర్సీ తో ఉన్న ఫొటోను పంచుకుంటున్నారు. జెర్సీపై ముగ్గురు స్టార్లు కూడా ఉన్నారు. భారత జట్టు కొత్త జెర్సీలో ఆసియా కప్ లోగో కూడా కనిపిస్తుంది. భారత జట్టు ఇప్పటి వరకు మూడు సార్లు ప్రపంచ కప్ టైటిల్స్ గెలుచుకోవడం విశేషం. జడేజా మినహా ఏ ఆటగాడు కూడా కొత్త జెర్సీ ఫొటో షేర్ చేయలేదు. దీంతో కొత్త జెర్సీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రేక్షకుల నుంచి పలు కామెంట్లు కూడా వస్తున్నాయి.

Team India New Jersey- Asia Cup 2022
Asia Cup 2022

పాకిస్తాన్ జట్టు కూడా తన కొత్త జెర్సీ ఫొటోలను షేర్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీలో ఆసియా కప్ ఆడిన పాకిస్తాన్ జట్టు తన కొత్త జెర్సీని విడుదల చేసింది. ఆటగాళ్ల ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో పాక్ ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఆసియా కప్ లో భాగంగా ఈనెల 28న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. దీంతో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీసు ముమ్మరం చేశాయి. ఎలాగైనా గెలిచి తమ ప్రేక్షకులకు కానుగా అందివ్వాలని రెండు జట్లు భావిస్తున్నాయి.

Also Read:Bellamkonda Sreenivas: బిజినెస్ మ్యాన్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్..డైరెక్టర్ ఎవరో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper