Homeఎంటర్టైన్మెంట్Anushka Shetty Marriage: ప్రభాస్ కంటే ముందు ఓ హీరో మరొక సినిమాటోగ్రాఫర్ తో అనుష్క...?

Anushka Shetty Marriage: ప్రభాస్ కంటే ముందు ఓ హీరో మరొక సినిమాటోగ్రాఫర్ తో అనుష్క…?

Anushka Shetty Marriage: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి పెళ్లి ఎప్పుడనేది ఎవర్ గ్రీన్ టాపిక్. 40 ప్లస్ లోకి వెళ్లిన అనుష్క పెళ్లి మాటెత్తడం లేదు. అయితే ఆయనతో పెళ్లి ఈయనతో పెళ్లి అంటూ పుకార్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ కి చెందిన నగల వ్యాపారితో అనుష్క పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఆ వార్త కూడా ఎప్పటిలానే గాలిలో కలిసిపోయింది. బాగా ప్రాచుర్యం పొందిన వార్త మాత్రం… ప్రభాస్-అనుష్కల వివాహం. ఏళ్ల తరబడి ఇది మీడియాలో నానుతూనే ఉంది. బాహుబలి 2 విడుదలయ్యాక అనుష్క మెడలో ప్రభాస్ తాళికడతాడని వందల సంఖ్యలో వార్తలొచ్చాయి.

Anushka Shetty Marriage
Anushka Shetty Marriage

ఇక సాహో మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ ని ఈ ప్రశ్న వెంటాడింది. చెన్నై, ముంబై, బెంగుళూరు ఏ నగరానికి వెళ్లినా అనుష్కతో మీకున్న బంధం ఏమిటని అడిగేవారు. చేసేది లేక ప్రభాస్ సహనంగా మేము మిత్రులం మాత్రమే అని సమాధానం చెప్పేవాడు. ఏళ్ళు గడుస్తున్నా ప్రభాస్-అనుష్కల పెళ్లి పుకారుగానే ఉన్న నేపథ్యంలో మీడియా దీనిపై ఫోకస్ తగ్గించేసింది. ప్రభాస్ తో అనుష్క వివాహం జరగనిపని అని ఒక నిర్ణయానికి వచ్చారు.

కాగా ప్రభాస్ కంటే ముందు ఒక హీరో, మరొక సినిమాటోగ్రాఫర్ తో అనుష్క పెళ్లి అంటూ ప్రధానంగా వినిపించింది. ఆ హీరో ఎవరో కాదు గోపి చంద్. సిల్వర్ స్క్రీన్ పై అనుష్క-గోపి చంద్ సక్సెస్ ఫుల్ పెయిర్ గా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, శౌర్యం చిత్రాలు తెరకెక్కాయి. లక్ష్యం సూపర్ హిట్ కాగా, శౌర్యం మూవీ పర్లేదు అనిపించుకుంది. ఆ చిత్రాల సమయంలో అనుష్క-గోపీచంద్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని కథనాలు వెలువడ్డాయి. కానీ అది జరగలేదు. 2013 లో గోపిచంద్ నటుడు శ్రీకాంత్ కి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు.

Anushka Shetty Marriage
Anushka Shetty Marriage

అలాగే సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తో అనుష్క పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. ఇరు కుటుంబాల సభ్యులు మాట్లాడుకున్నారని, త్వరలో పెళ్లని గట్టిగా ప్రచారమైంది. ఈ పుకార్లు వినిపించిన కొన్నాళ్ళకు సెంథిల్ కుమార్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. అలా ప్రభాస్ కంటే ముందు గోపీచంద్, సెంథిల్ కుమార్లతో అనుష్క పెళ్లని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా… అనుష్క పెళ్లి చేసుకొని మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version