Lesson to Cheated: సమాజంలో హుందాగా బతకాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే అనుకున్న జీవితాన్ని పొందగలుగుతారు. మరికొందరు ఎంత నిజాయితీగా ఉన్నా.. ధర్మాన్ని పాటించిన.. మోసపోతూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, రిలేషన్షిప్ ఇలా ఎక్కడైనా ఏదో విధంగా మోసపోయి బాధపడుతూ ఉంటారు. అయితే చాలామంది తమను మోసం చేసిన వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటారు. ఇలా పగ తీర్చుకోవాలి అనుకొని వాటి కోసమే సమయాన్ని కేటాయిస్తూ.. సొంత పనులను వదిలేస్తుంటారు. పగ తీర్చుకోవడం వల్ల వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలియదు.. కానీ ఈ సమయంలో కెరీర్ మొత్తం నాశనం అవుతుందనే విషయాన్ని ఎవరు గుర్తించరు.. మరి మోసం చేసిన వారు ఏం చేయాలి? ఏం చేస్తే మోసం చేసిన వారికి తగిన గుణపాఠం అవుతుంది?
ఈ భూమి మీద ఉన్న వారు అందరూ మంచివారే అని అనుకోలేం. రకరకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు. వీరిలో కొందరు మంచివారు ఉండవచ్చు.. మరికొందరు మోసం చేసేవారు ఉండవచ్చు. అయితే మోసం చేసేవారు మెడకు బోర్డు తగిలించుకొని ఎవరూ ఉండరు. వారు మోసం చేసిన తర్వాత అసలు విషయం అర్థం అవుతుంది. మోసపోవడం తప్పు కాదు.. కానీ పదే పదే మోసపోవడం మాత్రం నిర్లక్ష్యమే అవుతుంది. అయితే ఒకసారి మోసపోయిన తర్వాత మరోసారి మోసపోకుండా ఉండడానికి.. మోసం చేసిన వారిని పగ తీర్చుకోవడం కరెక్టు కాదు అని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అది ఎలా అంటే?
ఉదాహరణకు అడవిలో వెళ్ళినప్పుడు ఒక పాము కాటేస్తుంది. అయితే తాను పామును ఎలాంటి ఇబ్బంది పెట్టకపోయినా.. తనను పాము కాటేసిందని కోపంతో ఆ పామును వెంటపడి చంపలేము కదా.. అలాగని మోసం చేసిన వారిని వెంటపడి వారికి గుణపాఠం చెప్పాలని తిరుగుతూ ఉండడం జీవితాన్ని వృధా చేసుకోవడమే. అయితే మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పాలని కొందరు అనుకుంటారు. అది ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం..
మంచిగా జీవించాలని అందరి కోరుకుంటారు. కానీ కొందరు మంచిగా ఉండి మరొకరు బాగా లేకపోతే.. మంచిగా ఉన్నవారికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే దానిని చేదించగలం. అయితే ఇలాంటి సమయంలో మిగతా వారిని లేదా మోసం చేసే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారిపై దృష్టి పెట్టడం వల్ల కెరీర్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కొందరు ఒకరి వల్ల మోసం పోవచ్చు.. మరికొందరు చాలామంది మనుషుల వల్ల మోసపోవచ్చు. అయితే వారిని పట్టించుకోకుండా కెరీర్ పై దృష్టి పెట్టి అనుకున్నది సాధిస్తే… అప్పుడు మోసం చేసిన వారే పశ్చాత్తాప పడతారు. అంతేకాకుండా గెలిచిన వారిని చూసి మోసం చేసిన వారు సిగ్గు పడిపోతూ ఉంటారు. ఇంతకు మించిన పగ తీర్చుకోవడం అంటూ ఏదీ ఉండదు. ఇలా సమయాన్ని వృధా చేసుకోకుండా ఇతర విషయాలు పట్టించుకోకుండా కేవలం కెరీర్ పై దృష్టి పెట్టిన వారు మాత్రమే జీవితంలో విజయం సాధించగలరు.