Homeక్రీడలుIPL 2022: చైనాతో...

IPL 2022: చైనాతో సరిహద్దు వివాదం ఎఫెక్ట్… ఐపీఎల్ స్పాన్సర్‌గా టాటా..

IPL 2022: క్రికెట్ లవర్స్ ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని అతి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భారత దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ ఐపీఎల్ ప్లాన్స్ మార్చుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా వేలం వాయిదా వేయడంతో పాటు ఐపీఎల్ టోర్నీని పూర్తిగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించాలని అనుకుంటుందట.

IPL 2022
IPL 2022

ఈ క్రమంలోనే టైటిల్ స్పాన్సర్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసేసుకుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా మ‌న దేశానికే చెందిన‌ టాటా గ్రూప్ సంస్థ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చ‌ర్చించి ఈ డెసిషన్ తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది అనగా రెండేళ్ల పాటు టాటా సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా ఉండబోతున్నది.

Also Read: మేఘాలు ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా లెక్కిస్తారో తెలుసా?

2020లో చైనా దేశంతో భారత్‌కు సరిహద్దు వివాదం నెలకొని ఉండటంతో ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్నటువంటి వివోను తొలగించాలని అప్పటి నుంచి డిమాండ్స్ ఉన్నాయి. కాగా, తాజగా చైనీస్ కంపెనీ వివో స్పాన్సర్ షిప్ నుంచి తప్పకోబోతున్నది. వివో కంపెనీకి ఉన్న ఒప్పందం ప్రకారం ఇంకా రెండేళ్ల పాటు స్పాన్సర్ షిప్ లో ఉండాల్సింది. కానీ, వివో తప్పుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ పది జట్లతో జరగనుంది. 2011 త‌ర్వాత ఐపీఎల్ ఇలా మ‌ళ్లీ 10 జ‌ట్ల‌తో జరగబోతున్నది.

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది అనగా ఈ సారి కూడా ఐపీఎల్ సమ్మర్ లోనే ఉండబోతున్నది. ఇందుకోసంగాను ఇప్పటికే కొన్ని కొత్త జట్లు కలవబోతున్నాయి. లక్నో, అహ్మదాబాద్ కలవనున్నాయి. ఇక ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా కూడా పూర్తి అయింది. కొత్త జట్లు అనగా లక్నో, అహ్మదాబాద్ తమ రిటెన్షన్ ఆటగాళ్లను ఎంచుకోవడానికిగాను బీసీసీఐ ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఇప్పటి వకు ఎటువంటి షెడ్యూల్ ఖరారు చేయలేదు. కానీ, వచ్చే నెల మొదటి వారంలో ఐపీఎల్ మెగా వేలం జరిగే చాన్సెస్ అయితే ఉన్నాయి. ఏప్రిల్ రెండో వారంలో ఐపీఎల్ స్టార్ట్ కానుంది.

Also Read: అమెరికా ఆరోగ్యవ్యవస్థకే చుక్క‌లు చూపిస్తున్న‌ క‌రోనా.. రాబోయే రోజుల్లో పీక్ స్టేజ్‌కి..

Get notified whenever we post something new!

Continue reading

Indian Tradation: మ‌హిళ‌లు బొట్టు పెట్టుకోవ‌డం వెన‌క ఉన్న ఆరోగ్య సూత్రం ఇదే..!

Indian Tradation: ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రకాల సంప్రదాయాలు ఉంటాయి. వివిధ దేశాల్లో వివిధ రకాల సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. ఏ సంప్రదాయం ఎలా ఉన్నా కానీ వాటి వెనుక ఏదో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఆ సంప్రదాయాలను పాటించాలని కూడా పేర్కొంటారు. అదే...

Jasmine: ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఉందా..?

Jasmine: హిళలు తలలో పూలు పెట్టుకోవడం సాధారణ విషయమే. అయితే ఎక్కువ మంది ఆడవాళ్లు మల్లెపూలను తలలో పెట్టుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే చాలా మంది అందం కోసమే ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకుంటారని భావిస్తారు. కానీ ఆడవాళ్లు మల్లెపూలను ఇష్టపడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉందని మాత్రం తెలియదు. మల్లెపూలను పూలలోనే రాణిగా పిలుస్తుంటారు....

Lucky Stone By Date Of Birth: జ‌న్మించిన నెల‌ను బ‌ట్టి ఏ రాయి ధ‌రించాలో తెలుసుకోండి.. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..

Lucky Stone By Date Of Birth: జ‌నాల‌కు ఉండే న‌మ్మ‌కాల‌లో రంగురాళ్ల‌ను ధ‌రించ‌డం కూడా ఒక‌టి. వీటిని ధ‌రిస్తే త‌మ‌కు అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని, తాము అనుకున్న ప‌నులు అవుతాయ‌ని అనుకుంటారు. కాగా ఇందులో పుట్టిన నెల‌ను బ‌ట్టి ఏ రంగురాళ్ల‌ను ధ‌రిస్తే అదృష్టం క‌లిసి వ‌స్తుందో తెలుసుకోవ‌చ్చు. జ‌న‌వ‌రిలో పుడితే గోమేదికం...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version