Hangover Cure: ప్రపంచమంతా కొత్త సంవత్సరపు వేడుకల్లో తడిసి ముద్దైంది. కరోనా ఈ ఏడాదిలోనైనా పూర్తిగా తొలగిపోయి అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ అంటేనే యువత సంబరాల్లో మునిగి తేలుతుంది. మందుబాబుల గురించి ప్రత్యేకించి చెప్పాలా..? రాత్రి మొదలెట్టి.. తెల్లారేదాక పార్టీలో చిందులు తొక్కుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. వారు చేసే హంగామా పార్టీకే హైలెట్. అయితే రాత్రంతా పుల్‌గా తగిన మందుబాబుల పరిస్థితి ఉదయాని కల్లా తలపట్టుకోవడం ఖాయం.
ఉదయం లేచినప్పటి నుంచి హ్యాంగ్ ఓవర్‌తో నరకం చూస్తుంటారు. అయితే వీరి కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే.. హ్యాంగ్ ఓవర్ నుంచి సునాయసంగా బయటపడొచ్చు. అవ్వేంటో ఒసారి చూద్దాం.
రాత్రంతా పుల్‌గా తాగిన మద్యం వీరులకు.. పొద్దున లేవగానే తలనొప్పి ఓ రేంజ్‌లో ఉంటుంది. అతిగా మందు తాగడంతో శరీరానికి విటమిన్లు, లవణాలు అందక డీ హైడ్రేట్ అవుతుంది. దీని కారణంగానే మందుబాబులు పొద్దునే హ్యంగ్ ఓవర్ బారిన పడుతుంటారు. దీంతో ఈ బాధ నుంచి ఉపశమనం పొందాలంటే లేచిన వెంటనే నీరు తాగితే మంచింది. వీలైనంత ఎక్కవ నీరు తాగడానికి ప్రయత్నించాలి.
హ్యాంగ్ ఓవర్ నుంచి త్వరగా బయటపడటానికి మరో చిట్కా కూడా ఉంది. ఉదయం లేవగానే కొన్ని నీళ్లు తాగిని తర్వాత కొంత విరామం ఇవ్వాలి. అనంతరం నిమ్మరసంలో కాసింత తేనె కలిపి తాగాలి. దీంతో కొద్దిసేపటికే హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే తెనే, నిమ్మరసంలో పొరపాటున కూడా చక్కెర కలపకూడదు.
రాత్రి పీకలదాక తాగినా కొద్దరికి పొద్దున కూడ ఆ మత్తు వదలదు. ఎందుకంటే వారు తాగింది మోతాదుకు మించి.. వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే.. లేచిన తరువాత వారు రెండు చేతులు తలకు పట్టుకుని అలా కూర్చుని ఉండిపోతారు అంతే. ఇలాంటి హ్యాంగ్ ఓవర్ తగ్గాలంటే నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, ద్రాక్ష, కరబూజ వంటి పండ్లు తీసుకోవాలి. అలాగే నువ్వుల గింజలకు బెల్లం కలుపుకుని తిన్న మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంలో అల్లం కూడా వేసుకోవచ్చు. అరటి పండ్లు తింటే కూడా హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మందు పుల్లుగా తాగడంతో బాడీలో పొటాషియం, మెగ్నిషియం స్థాయిలు తగ్గిపోయింటాయి. దీంతో వీటి స్థాయిలను పెంచడంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది.