Homeలైఫ్ స్టైల్Lucky Stone By Date Of Birth: జ‌న్మించిన నెల‌ను బ‌ట్టి ఏ రాయి ధ‌రించాలో...

Lucky Stone By Date Of Birth: జ‌న్మించిన నెల‌ను బ‌ట్టి ఏ రాయి ధ‌రించాలో తెలుసుకోండి.. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..

Lucky Stone By Date Of Birth: జ‌నాల‌కు ఉండే న‌మ్మ‌కాల‌లో రంగురాళ్ల‌ను ధ‌రించ‌డం కూడా ఒక‌టి. వీటిని ధ‌రిస్తే త‌మ‌కు అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని, తాము అనుకున్న ప‌నులు అవుతాయ‌ని అనుకుంటారు. కాగా ఇందులో పుట్టిన నెల‌ను బ‌ట్టి ఏ రంగురాళ్ల‌ను ధ‌రిస్తే అదృష్టం క‌లిసి వ‌స్తుందో తెలుసుకోవ‌చ్చు. జ‌న‌వ‌రిలో పుడితే గోమేదికం (garnet) రాయి అదృష్టాన్ని తీసుకువ‌స్తుంది. దీని వ‌ల్ల ఎలాంటి భ‌యాందోళ‌న‌లు ద‌రి చేర‌వు.

Lucky Stone By Date Of Birth
Birthstones

ఫిబ్రవరిలో పుట్టిన వారికి కురువింత (amethyst) రాయి క‌లిసి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ద‌రిచేర‌వు. మార్చిలో పుట్టిన వారికి నీలపు రత్నం (aquamarine) ధ‌రించండి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఏప్రిల్‌లో పుట్టిన వారు వజ్రం ధరించండి. దీని వ‌ల్ల నెగెటివ్ ఆలోచ‌న‌లు రావు. చెడు శక్తులు మీ ద‌రి చేర‌వు.

మే నెలలో పుడితే పచ్చ లేదా మరకతం (Emerald) రాయిని ధ‌రించండి. దీని వ‌ల్ల ఏ ప‌ని చేసినా క‌లిసి వ‌స్తుంది. జూన్‌లో పుట్టిన వారికి ముత్యం రంగు రాయిని ధ‌రిస్తే మేలు జ‌రుగుతుంది. రూబీ రాయిని జూలై నెల‌లో పుట్టిన వారు ధ‌రిస్తే మంచిది. దీని వ‌ల్ల నిరాశ, నిస్పృహలు తొల‌గిపోతాయి. ఆగస్టులో పుట్టిన వారు పచ్చ (green period stone) రాయిని ధ‌రిస్తే మంచిది. దీని వ‌ల్ల‌ ఒత్తిడి త‌గ్గిపోతుంది.

సెప్టెంబర్ నెల‌లో జ‌న్మించిన వారు నీలకాంత మణి (nilakanta mani) రాయిని పెట్టుకోవాలి. అక్టోబర్ లో పుట్టిన వారు ఓపాల్ రత్నం (opal) రాయిని పెట్టుకోవాలి. ఒపాల్ అంటే చాలా రంగుల‌తో దొరికేది అన్న మాట‌. ఇక నవంబర్ నెల‌లో జ‌న్మించిన వారు పుష్పరాగం (topaz) రాయిని ధరించాలి. డిసెంబర్ నెల‌లో పుట్టిన వారికి మణి (turquoise) రాయిని పెట్టుకోవాలి. ఈ రాయిల‌ను పెట్టుకుంటే చాలా అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అయితే ఇది క‌చ్చితంగా అని చెప్ప‌లేం కాబ‌ట్టి.. మీరు ఏదైనా రాయిని పెట్టుకోవాల‌నుకుంటే మాత్రం.. ఓ సారి జ్యోతిష్యుల‌ను క‌లిస్తే బెట‌ర్‌.

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version