https://oktelugu.com/

Restaurants: అబ్బాయిలను ట్రాప్ చేసి రెస్టారెంట్ లకు తీసుకొని వెళ్తున్న అమ్మాయిలు. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

హాయ్ అని మెసేజ్ వస్తుంది. కొన్ని రోజులు చాటింగ్, ఆ తర్వాత సెల్ ఫోన్ లో టాకింగ్ చేస్తుంటారు. ఇక కలుసుకోవడం అనే ఘట్టం వస్తుంది. సో అమ్మాయే రెస్టారెంట్ పేరు చెబుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 20, 2024 / 03:01 PM IST

    Restaurants

    Follow us on

    Restaurants: ఈ మధ్య పక్కింట్లో, పొరుగింట్లో ప్రేమలు పుట్టడం లేదు. బస్ స్టాప్ లు, కాలేజీలు, హాస్టల్స్ ముందు ప్రేమలు మొదలయ్యేవి. కానీ ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే ప్రేమలు పుడుతున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్ లలో హాయ్ అని ఒక మెసేజ్ తోనే మొదలవుతుంది ఈ ప్రేమ. కాదు కాదు స్కామ్. ఏంటి స్కామ్ అంటున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీరే షాక్ అవుతారు? ఇలాంటి సంఘటన మీకు ఎదురైతే నిజమే అనుకుంటారు? మరి ఆలస్యం ఎందుకు మ్యాటర్ లోకి ఎంట్రీ అవుదాం.

    హాయ్ అని మెసేజ్ వస్తుంది. కొన్ని రోజులు చాటింగ్, ఆ తర్వాత సెల్ ఫోన్ లో టాకింగ్ చేస్తుంటారు. ఇక కలుసుకోవడం అనే ఘట్టం వస్తుంది. సో అమ్మాయే రెస్టారెంట్ పేరు చెబుతుంది. మోసం చేయడం లేదు కేవలం రెస్టారెంట్ కే కదా రమ్మంది అంటూ నీట్ గా డ్రెస్ చేసుకొని హెయిర్ ను ఓ రెండు సార్లు సెట్ చేసుకొని మరీ వెళ్తుంటారు. ఆమె చెప్పిన రెస్టారెంట్ కు వెళ్లగానే ఆర్డర్స్ చెబుతుంటుంది. తీరా చూస్తే బిల్ మీ ప్యాకెట్ మనీకి మించి అవుతుంది. ఎందుకంటే అదొక స్కామ్ రెస్టారెంట్.

    అర్థం కాలేదు కదా..? ఈ మధ్య కొన్ని రెస్టారెంట్లు అమ్మాయిలతో అబ్బాయిలను ట్రాప్ చేయించి వారి రెస్టారెంట్లకు పిలిపిస్తున్నారు. అక్కడ అధిక మొత్తంలో ఆర్డర్ చేయించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఇలాంటి స్కామ్ ల బారిన పడిన యువత ఆందోళన చెందుతున్నారు.

    ఈ స్కామ్ ల బారిన పడకుండా ఉండాలంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన రెస్టారెంట్ గురించి తెలుసుకొని రివ్యూస్ చూసిన తర్వాత ఆ రెస్టారెంట్ కు వెళ్లండి. లేదంటే మీరే మరో మంచి రెస్టారెంట్ కు తీసుకొని వెళ్లండి. అప్పుడు మీ ఆన్ లైన్ లవ్ నిజమా లేదా త్వరలోనే బయటపడుతుంది. సో ఆల్ ది బెస్ట్.

    Tags