Superfoods To Control Diabetes: ప్రపంచవ్యాప్తగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు వాతావరణంలో మార్పుల కారనంగా శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో అనేక వ్యాధులు వస్తున్నాయి. వీటిల్లో షుగర్ చాలా మందిలో బయడపడుతోంది. అయితే షుగర్ తగ్గించేందుకు మెడిసిన్ వాడడమే మార్గం. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేసినా షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు సరైన ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవడానికి కొన్ని పదార్థాలపై ప్రయోగాలు చేశారు.

సాధారణ వ్యక్తిలో ఉపవాసం తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు 100 కంటే తక్కువగా ఉండాలి. అదే ఆహారం తీసుకున్న తరువాత 140 కంటే తక్కువగా ఉండాలి. కానీ సూపర్ ఫుడ్ చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ సూపర్ ఫుడ్ పదార్థాలేవో తెలుసుకుందాం. ఈ పదార్థాల కోసం పెద్దగా ప్రయాణాలు చేయనక్కర్లేదు. ఇంట్లో ఉండే కిచెన్ రూంలోకి వెళితే లభిస్తాయి. ఈ పదార్థాల గురించి తెలుసుకుందాం..
దాల్చిన చెక్క:
మధుమేహవ్యాధిగ్రస్తుల్లో దాల్చిన చెక్క బాడీ మాస్ ఇండెక్స్ ను తగ్గిస్తుందని నిరూపించబడింది. దాల్చిన చెక్కలో వివిధ పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఆహారంలో ఇది రుచికరంగానూ ఉంటుంది. ఈ పదార్థంతో శరీరంలోని లిపిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
ఓక్రా:
దీనిని బిండి అని కూడా పిలుస్తారు. ప్లేవనాయిడ్ల యొక్క గొప్ప మూలంగా పేర్కొనే ఓక్రా యాంటి ఆక్సిడెంట్. ఇది గుండె ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. పాలీశాకరైడ్స్ అనే సమ్మేళనాలలో ఇది పుష్కలంగా ఉంటుంది.
పెరుగు:
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి పెరుగు ఉపయోగపడుతుంది. ప్రోబయోటిక్స్ ఆధారంగా ఉండే పులియబెట్టిన ఆహారాలను తరుచుగా ప్రోత్సహిస్తాయి. పెరుగు అనేది సాధారణంగా తీసుకునే స్నాక్స్ లో పెరుగును వినియోగించుకోవచ్చు.
చిక్కుళ్లు:
చిక్కుళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఈ ప్రక్రియ భోజనం తరువాత రక్తంలో పెరిగే చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

విత్తనాలు:
సూపర్ ఫుడ్ జాబితాలో విత్తనాలు కూడా ఉన్నాయి. గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియా గింజలు మొదలైన వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్,యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో అధిక చక్కెరను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతాయి.
తృణ ధాన్యాలు:
చిక్కుళ్లు లాగే తృణధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఓట్స్, క్వినోవా, హోల్ వీట్ మొదలైన తృణ ధాన్యాలు ఉండడం వల్ల షుగర్ గణనీయంగా తగ్గుతుంది. ఆహారంతో తీసుకోవడమే కాకుండా కూర వండడానికి కూడా ఉపయోగపడుతాయి.
గింజలు:
ఇవి విత్తనాలను పోలి ఉంటాయి.కానీ వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావచ్చు.
గుడ్లు:
గుడ్లు సూపర్ ఫుడ్స్ లో ప్రధానమైంది. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఇన్సెలిన్ సెన్సిటివిటీని తగ్గించడానికి, మెరుగుపరచడానికి పనిచేస్తాయని నిరూపించబడ్డాయి.
ఇలా సూపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఇవి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కలిగితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. దాదాపు సూపర్ ఫుడ్ లో ఉండే పోషకాలు కీడు కంటే మేలే చేస్తాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు సూపర్ ఫుడ్ ను అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి.