Homeలైఫ్ స్టైల్New desire in an attractive model: ఆకర్షించే మోడల్ లో కొత్త డిజైర్.. ఫోటోస్...

New desire in an attractive model: ఆకర్షించే మోడల్ లో కొత్త డిజైర్.. ఫోటోస్ లీక్.. పీచర్స్ ఎలా ఉన్నాయంటే? 

New desire in an attractive model: దేశంలో అత్యధిక కార్లు  అమ్మకాలు జరిపే కంపెనీల్లోమారుతి ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం వరకు అన్ని రకాల వేరియంట్లు అందుబాటులో ఉంచే ఈ కంపెనీ సెడాన్ కార్లు విక్రయించడంలో ముందు ఉంటుంది. దీని నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు దశాబ్దాలుగా విక్రయాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.వీటి తరువాత  Swift Dezire ను కూడా ఎక్కువగా కోరుకుంటారు.  ఇప్పటికే డిజైర్ ను చాలా మంది కొనుగోలు చేశారు. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి కొత్త డిజైర్ ను అందబాటులోకి తీసుకురానున్నారు. దీనిని నవంబర్ 11న మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ తరుణంలో ఈ కారుకు సంబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి. ఈ కారు ఎలా ఉందంటే?
మారుతి డిజైర్ మార్కెట్లో ఉన్న ప్రకారం 1.2, 1.3  లీటర్ పెట్రోల్, డీజిల్  అనే రెండు ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజిన్ పై 82 బీహెచ్పీ, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు పెట్రోల్ వేరియంట్ పై 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే డీజిల్ వేరియంట్ 28.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మారుతి డిజైర్ ఇన్నర్ లో 7 అంగుళాల స్మార్ట్ డిస్ ప్లే తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సేప్టీ కోసం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ వంటివి ఉన్నాయి.
అయితే తాజాగా రిలీజ్ అయ్యే కొత్త కారులో కొన్ని మార్పులు చేశారు. ఈ కొత్త కారులో డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, వై ఆకారపు టెల్ టైల్్, ఆండ్రాయిండ్ ఆటో ప్లే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఉండగా.. కొత్తగా 9 అంగుళాల డిస్ ప్లే ఉండనుంది. అలాగే ఆన్ లాక్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ తో కూడిన 3 స్పోక్ స్టిరింగ్ వీల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కాంపాక్ట్ సెడాన్ వేరియంట్ లో సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్ రూప్ కలిగిన ఇందులో ఇంజిన్ కూడా కొత్తగా కనిపిస్తుంది.
కొత్త  డిజైర్ లో 1.2 లీటర్ జడ్ సిరీస్  ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 80 బీహెచ్ పీ పవర్ తో పాటు 112 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు లీటర్ పెట్రోల్ కు 32 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కొత్త డిజైర్ ను రూ.6.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్, ఎలక్ట్రిక్ పోల్టబుల్ వంటి ఫీచర్లు ఉన్నఈ సెడాన్ కారు కొత్తగా బాక్సీ డిజైన్ ను కలిగి ఉంది. ఎల్ ఈడీ లైట్స్, ఇంటిగ్రేటేడ్ ఎల్ ఈడీ డీఆర్ఎల్ లు ఆకర్షించనున్నాయి.
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version