David Miller: టి20 క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ సమీకరణం ఎలా మారుతుందో అర్థం కాదు.. నరాలను మెలిపెట్టి, సీటు చివరి అంచున కూర్చునేలా చేయడం టి20 క్రికెట్ మ్యాచ్ ల ప్రత్యేకత. ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ నడుస్తోంది. ఇక సూపర్ 12లో టీమిండియా పై విజయంతో సౌత్ఆఫ్రికా గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బలమైన జట్టుగా పేరు గడించిన దక్షిణాఫ్రికా ఇంతవరకు ఏ ఒక్క మెగా టోర్నీ గెలిచిన దాఖలాలు లేవు. ఇక సౌత్ ఆఫ్రికా విజయాల్లో కీలకపాత్ర కిల్లర్ మిల్లర్ దే. టి20 ప్రపంచ కప్ ముందే టీం ఇండియా గడ్డపై ఆడిన టి20 సిరీస్ లో మిల్లర్ విశ్వరూపం చూపించాడు. ఫామ్ లో ఉంటే ఎంత డేంజర్ అనేది అర్థమయ్యేలా చేశాడు. తాజాగా టీ 20 ప్రపంచ కప్ లో మిల్లర్ తో పాటు మార్క్రమ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు నాట్ అవుట్ గా నిలిచి అర్థ సెంచరీ తో జట్టును గెలిపించింది మాత్రం మిల్లరే. అందుకే అతడిని కిల్లర్ మిల్లర్ అని పిలుస్తారు.

రికార్డు అందుకున్నాడు
టీం ఇండియా పై సాధించిన విజయంతో మిల్లర్ టి20 క్రికెట్లో ఒక రికార్డు అందుకున్నాడు.. 2022లో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా చేజింగ్ కు దిగిన సందర్భాల్లో మిల్లర్ 16 ఇన్నింగ్స్ లో 14 సార్లు నాట్ అవుట్ గా నిలిచి జట్టును గెలిపించాడు.. అందుకే మిల్లర్ ను చేజింగ్ మాస్టర్ అని పిలుస్తారు.. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ మేజర్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా టీం ఇండియాను ఓడించడం మళ్ళీ ఇదే మొదటిసారి.. 2011 వన్డే వరల్డ్ కప్ లో నాగపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా సౌత్ ఆఫ్రికా ఓడించింది.

కాజాగా ఐదు వికెట్ల తేడాతో భారత్ ను సౌత్ ఆఫ్రికా చిత్తు చేసింది.. బౌలింగ్ లో మెరుగ్గా ఉన్న సౌత్ ఆఫ్రికా… బ్యాటింగ్ లో ఇప్పటికీ తడబడుతూనే ఉంది. మిల్లర్, మార్క్రమ్, డి కాక్ మినహా మిగతా వాళ్ళు ఎవరు ఆకట్టుకోవడం లేదు. భారత్ తో జరిగిన మ్యాచ్ లోనూ సౌత్ ఆఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. ఒకవేళ పైన చెప్పిన ముగ్గురు బ్యాట్స్మెన్ కనుక నిలదొక్కుకోకుండా ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది.