T20 World Cup 2022 Pakistan vs New Zealand: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. బుధవారం నుంచి సెమీ ఫైనల్స్ కు తెరలేవనుంది. దీంతో ఇక ఏ జట్టుకు కూడా రెండో అవకాశం లేదు. గెలిస్తే సరి.. లేకుంటే ఇంటికే.. సిడ్నీ క్రికెట్ మైదానంలో బుధవారం జరిగే మొదటి సెమిస్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

ఇలా సాగింది
టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ లో న్యూజిలాండ్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక లపై గెలిచి న్యూజిలాండ్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. అటు పాకిస్తాన్ ప్రస్థానం మాత్రం కిందా మీదా పడుతూ సాగింది. భారత్, జింబాబ్వే చేతిలో తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ జట్టు క్రీడాకారులు, ఆ దేశ అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ స్టోరీ నుంచి బయటకు వెళ్లాల్సిన జట్టుకు నెదర్లాండ్స్ సాధించిన విజయంతో ఊహించని రీతిలో అదృష్టం కలిసి వచ్చింది. ఈ ఉత్సాహంతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై గెలిచింది. సెమీస్ కు చేరుకుంది. మరోవైపు ప్రత్యర్థి న్యూజి లాండ్ పై పాకిస్తాన్ కు మెరుగైన రికార్డు ఉంది. కానీ ఈసారి అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కివీస్ పాకిస్తాన్ కు చెక్ పెట్టాలనే కసితో ఉంది.. ఈ మైదానాల్లో కివీస్ 2, పాకిస్తాన్ ఒక మ్యాచ్ అడగా.. అన్నింటిలోనూ గెలిచాయి.
బలాబలాలు ఏంటంటే
పాకిస్తాన్ సాధించిన విజయాలలో ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ భాగస్వామ్యం ఇప్పటివరకు లేదు. టి20 ఫార్మాట్ లో వీరిద్దరూ కూడా అత్యుత్తమమైన ఆటగాళ్లు. కానీ ఫామ్ లేమి తో బాధపడుతున్నారు. ఈ కీలక మ్యాచ్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ బ్యాట్లకు పని చెబితే భారీ స్కోరు సాధించడం పెద్ద లెక్క కాదు. ఇక మిడిల్ ఆర్డర్ లో ఇఫ్తికార్, షాన్ మసూద్ తో పాటు స్పిన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నారు. పాకిస్తాన్ బలం మొత్తం వారి బౌలింగ్ మీదే ఆధారపడి ఉంది. పేసర్లు షహీన్ ఆఫ్రిది, నసీం షా, మహమ్మద్ వసీం మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి షహీన్ ఫామ్ లోకి రావడం పాకిస్తాన్ కు అదనపు బలం.

అన్ని రంగాల్లో మెరుగు
న్యూజిలాండ్ పాకిస్తాన్ తో పోలిస్తే అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపిస్తున్నది. పాకిస్తాన్ మాదిరే బౌలర్లు కూడా ప్రత్యర్థి జట్టుపై చెలరేగిపోతున్నారు. ఇదే మైదానంలో ఆస్ట్రేలియా శ్రీలంక టాప్ ఆర్డర్ ను న్యూజిలాండ్ పెసర్లు బౌల్డ్ సౌదీ కుప్ప కూల్చారు. కివీస్ జట్టుకు సునాయాసమైన విజయాలు అందించారు.. ఇదే తరహాలో అంతగా ఫామ్ లో లేని పాకిస్తాన్ ఓపెన్ దెబ్బతీసి ఆదిలోనే ఒత్తిడిలోకి నెట్టాలి అనుకుంటున్నారు. లోకి ఫెర్గ్యూ సన్ పదునైన బంతులు వేస్తున్నాడు. ఇక బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ లో ఫిన్ అలెన్, కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ తో పాటు మిడిల్ ఆర్డర్లో ఫిలిప్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అలాగే వీలు గాయం తర్వాత బ్యాటర్ డారిల్ మిచెల్ కూడా ఆకట్టుకుంటున్నాడు. కానీ లెగ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో కేన్, మిచెల్ ఇబ్బంది పడుతున్నాడు. క్రమంలో షాదాబ్ పాకిస్తాన్ జట్టుకు కీలకం కానున్నాడు..
గత రికార్డు ఎలా ఉందంటే
పాకిస్తాన్, కివీస్ ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో మూడుసార్లు తలపడ్డాయి. మూడు సెమీఫైనల్స్ మ్యాచ్ ల్లోనూ 1992, 1999 వన్డే వరల్డ్ కప్, 2007 t20 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో పాకిస్తాన్ గెలిచింది. ఇక సహజంగా ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తూ ఉంటుంది. ఈసారి ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జుట్టు ఐదుసార్లు గెలిచింది. బుధవారం చిరుజల్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం అనుకూలిస్తుందని పేర్కొన్నది. 2007 టి20 వరల్డ్ కప్ తర్వాత మరో సెమీస్ లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికొస్తే మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్( కెప్టెన్), మహమ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, మహమ్మద్ నవాజ్, షాదాబ్, మహమ్మద్ వసీం, నసీం షా, షహీన్, రౌఫ్.
న్యూజిలాండ్ విషయానికి వస్తే అలెన్, కాన్వే, విలియమ్సన్ ( కెప్టెన్), ఫిలిప్, మిచెల్, నీషమ్, షాంట్నర్, సౌథి, బౌల్ట్, సోధీ, ఫెర్గూసన్.