spot_img
Homeక్రీడలుT20 World Cup 2022 India vs England: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: గెలుపెవరిది? బలాబలాలేంటి?...

T20 World Cup 2022 India vs England: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: గెలుపెవరిది? బలాబలాలేంటి? టీమిండియా టీం 11 ఇదే!

T20 World Cup 2022 India vs England: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ లో మరో కీలక పోరు గురువారం అడిలైడ్ లో భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభం కానుంది.. న్యూజిలాండ్ పై జరిగిన సెమీస్ పోరులో పాకిస్తాన్ గెలిచిన నేపథ్యంలో… ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది.. ఇప్పటికే ఇరుజట్లు కఠోర ప్రాక్టీస్ చేశాయి.. ప్రాక్టీస్ జరుగుతున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి గాయం అయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. సౌత్ ఆఫ్రికా మినహా సూపర్ 12లో అన్ని మ్యాచ్ ల్లో ఇండియా విజయం సాధించింది.. జట్టులో సభ్యులు ఫుల్ జోష్ లో ఉన్నారు.. ఇదే ఫామ్ సెమీస్ లో కూడా సాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.. టోర్నీ ప్రారంభం నుంచి సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రాహుల్ మూల స్తంభాలుగా నిలిచారు.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో తప్పా, మిగతా మ్యాచ్ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఓపెనర్లు బలమైన భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం అవుతున్నారు.. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాణిస్తే ఇండియాను ఆపడం ఇంగ్లాండుకు సాధ్యం కాదు.. ఇక బౌలింగ్లో అర్షదీప్ సింగ్, షమీ, భువి కనుక రాణిస్తే టీం ఇండియాకు తిరుగు ఉండదు.

T20 World Cup 2022 India vs England
T20 World Cup 2022 India vs England

-అంత ఈజీ కాదు
ఇంగ్లాండ్ జట్టులో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ దూకుడుగా ఉంది. అలెక్స్ హేల్స్, బట్లర్, లివింగ్ స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్ వంటి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ లోనూ ఇంగ్లీష్ టీం సత్తా చాటుతోంది.. అయితే కీలక ఆటగాడు మలన్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇది భారత జట్టుకు అడ్వాంటేజ్. అయితే పాకిస్తాన్ సెమీస్ వెళ్లిన నేపథ్యంలో భారత జట్టు సెమిస్ లో ఎలాగైనా ఇంగ్లండ్ పై గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే జరిగితే మరో హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించడం ఖాయం.

-ఇండియా వైపే అడిలైడ్

అడిలైడ్ లోని ఓవర్ మైదానంలో టీం ఇండియాకు మెరుగైన రికార్డు ఉంది.. ఇక్కడ భారత జట్టు రెండు మ్యాచ్ లు ఆడి రెండింటిని గెలిచింది. 2021లో ఇక్కడ తొలి టి20 మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోనూ విజయం సాధించింది. ఇక ఇదే మైదానంపై 15 వన్డేలో ఆడి 9 మ్యాచ్ లు గెలిచింది. ఇక ఈ మైదానంపై ఇంగ్లీష్ టీం కు చెత్త రికార్డు ఉంది. 17 వన్డేలు ఆడి నాలుగు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. 2011లో ఆస్ట్రేలియాపై ఒక టి20 మ్యాచ్ ఆడి ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.. 2015 వన్డే ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై ఆడి 15 పరుగుల తేడాతో ఓడిపోయింది.

T20 World Cup 2022 India vs England
T20 World Cup 2022 India vs England

-విరాట్ వీర విహారం

విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు మూడు ఫార్మాట్ లో కలిపి కోహ్లీ ఇక్కడ పది మ్యాచ్ లు ఆడాడు.. మొత్తంగా 14 ఇన్నింగ్స్ లో 907 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.. రెండు టి20 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ మొదటి మ్యాచ్లో 90, రెండో మ్యాచ్లో 64 పరుగులు చేశాడు. ఇక టి20 ల్లో ఓవరాల్ గా ఇంగ్లాండ్, ఇండియా 22 సార్లు తలపడ్డాయి.. భారత్ 12 సార్లు విజయం సాధించింది. 2007, 2009, 2012లో ఇరుజట్లు పోరాడితే ఇందులో భారత్ రెండు సార్లు గెలిచింది.. అయితే ఈసారి జరిగే మ్యచ్ లో కూడా భారత క్రీడాకారులు కలిసికట్టుగా ఆడి విజయం సాధించి ఫైనల్ లో పాకిస్తాన్ జట్టుతో తలపడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. 15 సంవత్సరాలుగా ఊరిస్తున్న టి20 వరల్డ్ కప్ ని మరోసారి ఇండియాకు తీసుకురావాలని కోరుకుంటున్నారు.

నిన్న కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. ఈ మ్యాచ్లో మన ఇద్దరు కీపర్లు పంత్, దినేష్ కార్తీక్ ఆడడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్ లేదా అశ్విన్ స్థానంలో పంత్ ను తీసుకునే అవకాశాలున్నాయి. ఒక బౌలర్ ను తగ్గించి మరో బ్యాట్స్ మెన్ కు అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు. దీంతో ఈ రోజు ప్లేయింగ్ 11పై ఆసక్తి రేపుతోంది.

ఇండియా ప్లేయింగ్ 11
రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్, సూర్యకుమార్, హార్ధిక్ పాండ్యా, పంత్, దినేష్ కార్తీక్/ అక్షర్, అశ్విన్, భువి, షమీ, అర్షదీప్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version