Bigg Boss 6 Telugu- Revanth vs Keerthy: ఈరోజు కెప్టెన్సీ టాస్క్ చివరి కంటెండర్లు అయ్యేందుకు బిగ్ బాస్ ‘నాగమణి’ అనే టాస్కు ని నిర్వహించాడు.. : ఈరోజు కెప్టెన్సీ టాస్క్ చివరి కంటెండర్లు అయ్యేందుకు బిగ్ బాస్ ‘నాగమణి’ అనే టాస్కు ని నిర్వహించాడు.. ఈ టాస్కుకి సంచాలకులుగా ఇనాయ -వాసంతి వ్యవహరించగా..’ల్యాడర్’ టీం వారు ఢిఫెండర్లు గా , ‘స్నేక్’ టీం వారు అటాకర్స్ గా వ్యవహరించారు..ఈ టాస్కు హోరాహోరీగా సాగింది.. ఈ టాస్కులో పోటీ పడిన ఇంటి సభ్యులందరూ రేవంత్ ని బాగా టార్గెట్ చేసారు..బాగా ఫిజికల్ అయిపోతున్నాడు అంటూ అందరూ అరిచి గగ్గోలు పెట్టారు.

ముందుగా ఆది రెడ్డి గొడవకి వస్తాడు..’ఫిజికల్ గా అంత అగ్రెసివ్ అవ్వకు..ఒకసారి యెల్లో కార్డు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావ్’ అంటూ గట్టిగా రేవంత్ మీద అరుస్తాడు..’ఫిజికల్ టాస్కులో ఫిజికల్ అవ్వకుండా ఇంకా ఏమి అవుతారు..మీ వాళ్ళు నా మీద ఇందాక ఫిజికల్ అటాక్ ఎందుకు చేసారు..మీకో రూల్ మాకో రూలా’ అంటూ రేవంత్ గొడవకి దిగుతాడు..అలా వీళ్లిద్దరి మధ్య చాలాసేపటి వరకు గొడవ జరిగింది.
ఇక ఆ తర్వాత కీర్తి ఏకంగా రేవంత్ డిఫెండ్ చేస్తున్న నాగమణులను అటాక్ చేసి తీసుకొనే ప్రయత్నం చేస్తుంది..ఆ సమయం లో కీర్తి చేతి గోర్లు రేవంత్ కన్నుకి గుచ్చుకుంటుంది..అప్పుడు రేవంత్ ‘నా కన్ను పొడిచేసింది’ అంటూ గోల పెడుతాడు..నేను పొడవలేదు అంటూ కీర్తి అరిచి చెప్తుంది..అలా వీళ్లిద్దరి మధ్య గొడవ పెరుగుతూ జరుగుతూ ఉండగా కీర్తి రేవంత్ ని ‘నోరు మూసుకో’ అని తిడుతుంది..అప్పుడు రేవంత్ కూడా ‘నోరు మూసుకో’ అని గట్టిగా తిడుతాడు..మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తెలియాలంటే ఈ వీకెండ్ నాగార్జున జడ్జిమెంట్ వరుకు వేచి చూడాల్సిందే.

యెల్లో కార్డు ఇచ్చిన తర్వాత కూడా రేవంత్ ఫిజికల్ గా బాగా అగ్రెసివ్ అవ్వడం వల్ల.. అతని మీద నాగార్జున తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాడా..రెడ్ కార్డు ఇచ్చి ఇంటి నుండి పంపెస్తాడా..? అసలు ఈ వీకెండ్ ఏమి జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది..తానూ స్నేహితులు అనుకున్న శ్రీ సత్య కూడా రేవంత్ ని ఫిజికల్ అవ్వొద్దు అని అనడం అతనిని చాలా బాధపెట్టింది.