
Heart Attack Symptoms: ఇటీవల కాలంలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు వేధిస్తున్నాయి. ఉన్నట్లుండి కింద పడిపోవడంతో ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పట్టుమని పాతికేళ్లు కూడా లేని వారే గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల ముప్పును తప్పించుకోవడం ఎలాగనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ మేరకు ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. గుండె జబ్బుల నుంచి తప్పించుకునేందుకు కావాల్సిన ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
కరోనా వ్యాక్సిన్ తోనేనా?
కరోనా రక్కసిని రూపు మాపే క్రమంలో అందరు కరోనా టీకాలు తీసుకున్నారు. అవి తీసుకున్నాకే చాలా మందికి గుండె పోట్లు వస్తున్నాయి. అమెరికాలో కూడా ఇలా జరగడంతో అందరు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వైద్యులు మాత్రం వ్యాక్సిన్ తో గుండెపోటుకు సంబంధం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నాక మూడు నెలల లోపు గుండెపోటు వస్తే వ్యాక్సిన్ ప్రభావం అనుకోవాలి. కానీ మనవారు వ్యాక్సిన్ తీసుకుని ఆరు నెలలు దాటింది. దీంతో వ్యాక్సిన్ కు గుండెపోటుకు సంబంధం లేదని తేల్చేస్తున్నారు.
ఇంతకీ గుండెపోటుకు కారణం
గుండెపోటు రావడానికి అసలు కారణం తెలిస్తే షాకే. మనం రోజు తీసుకునే ఉప్పు మనకు ముప్పుగా మారుతోంది. కానీ మనం లెక్క చేయడం లేదు. ప్రతి రోజు ఒక మనిషి ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ మనం రోజుకు 10.8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాం. ఇది మన శరీర భాగాల్లో పేరుకుపోయి రక్తనాళాల్లో రక్తం సరఫరా కాకుండా అడ్డుగా నిలుస్తోంది. దీంతో చెడు కొవ్వు పేరుకుపోవడంతో రక్త సరఫరా నిలిచిపోయి గుండెపోటుకు కారణమవుతోంది.

గుండెపోటు వచ్చే ముందు సంకేతాలేంటి?
గుండె పోటు వచ్చే ముందు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని మనం గమనించుకుని చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే గాల్లో కలవచ్చు. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. గుండెపోటు వచ్చే ముందు కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. గ్యాస్, ఎసిడిటి పెరిగినట్లు అవుతుంది. గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపిస్తుంది. శరీరం బద్ధకంగా నీరసంగా అనిపిస్తుంది. గుండె నుంచి వెన్ను భాగం వైపు నొప్పి కలుగుతుంది. ఏ పని చేయకోయినా చెమటలు పట్టడం వంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఇవి కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఫలితం ఉంటుంది.