
Gastric Problems: ప్రస్తుతం గ్యాస్ సమస్య అందరిని వేధిస్తోంది. రోజురోజుకు గ్యాస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. గ్యాస్ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, మలబద్ధకం, ఆహార అలవాట్లు, జీవన శైలి వంటివి మనకు ఎన్నో రకాల కారణాల వల్ల సమస్య ఎక్కువవుతోంది. అజీర్తి, వ్యాయామం లేకపోవడం , కడుపు ఉబ్బరం, ఏం తినాలనిపించకపోవడం వంటి ఇబ్బందులు మనల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్యాస్ సమస్య నుంచి బయట పడటానికి పలు రకాల మందులు వాడుతున్నారు.
ఏ ఆహారాలు తీసుకోకూడదు
టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనెలో వేయించిన పదార్థాలు, నిల్వ పచ్చళ్లు తీసుకోవడం మంచిది కాదు. ధూమపానం, మద్యపానాలకు కూడా దూరంగా ఉండటం సురక్షితం. ప్రతి రోజు యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం చేసినట్లు అవుతుంది. దీంతో కూడా గ్యాస్ సమస్య దూరం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చిట్కాలు ఉపయోగించడంతో కూడా గ్యాస్ సమస్య లేకుండా పోతుంది. దీనికి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
దీనికి పరిష్కారం
గ్యాస్ సమస్యకు పరిష్కారంగా రోజు ఉదయం పరగడుపున శొంఠి పొడి, పాత బెల్లం సమానంగా తీసుకుని ఉండలు చేసుకుని వాటిని రోజుకో ఉండ చొప్పున తినాలి. తరువాత ఓ గ్లాస్ వేడి నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అర టీ స్పూన్ శొంఠి పొడి, ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మరిగించాలి. ఆ నీరు అరగ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టి గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది.

అల్లం, బెల్లంతో..
ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఒక అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. దానికి ఒక టీ స్పూన్ బెల్లం కలపాలి. ఆ నీరు ముప్పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించి అందులో ఒక టీ స్పూన్ బెల్లం వేసుకుని కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వడకట్టి గోరు వెచ్చగా అయ్యాక తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఇంటి చిట్కాలు ఉపయోగించి ఇంగ్లిష్ మందులకు బదులు ఇంటి వైద్యాన్ని నమ్ముకుంటే ఎంతో మంచిది. గ్యాస్ సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుంది.