Summer Heat Tips : ఎండాకాలం రాగానే చాలామంది వేడికి భయపడిపోతూ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత ఉండడంతో పాటు ఇక్కడ చెట్లు తక్కువగా ఉండడం వల్ల సరైన గాలివీయదు.ఇలాంటి సమయంలో గాలి కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేసుకుంటారు.. అయితే కేవలం వీటితోనే ఇల్లు చల్లగా అవుతుందని అనుకుంటే సరిపోదు. కొన్ని వస్తువుల వల్ల కూడా ఇల్లు చల్లగా మారుతుంది. అంతేకాకుండా ఇవి తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటాయి. మరి ఏసీ లేకుండా ఇల్లు చల్లగా మారాలంటే ఏం చేయాలి? ఎ లాంటి వస్తువులను కొనుగోలు చేయాలి?
Also Read : వేసవిలో పిల్లల అల్లరి చేయకుండా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఎండాకాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే కిటికీల వద్ద నవారు పట్టీలు వంటివి వేలాడ తీసుకోవాలి. వీటిపై ఎప్పుడూ నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా చల్లడం వల్ల ఇంట్లో చల్లగా మారుతుంది. అలాగే ఇంటి డోర్లపై ఉన్న కర్టెన్లు లైట్ కలర్ లతో కూడుకొని ఉండాలి. తక్కువ రంగు కలిగిన కర్టెన్లు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. అంతేకాకుండా కాటన్ సంబంధించిన కర్టెన్లు వేసుకొని వాటిపై నీళ్లు చల్లడం ద్వారా గది చల్లగా మారుతుంది. ఇంటిలోకి వెంటిలేషన్ వచ్చే ప్రాంతాల్లో పరదాలు లాంటివి వేలాడ తీసుకొని వాటిపై నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా ఇల్లు చల్లగా మారుతుంది.
ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడడం తగ్గించుకోవాలి. వీటి ద్వారా వేడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ తో పాటు కంప్యూటర్, టీవీ వంటి వస్తువులు ఆన్లో ఉన్నట్లయితే వాటి అవసరం లేనప్పుడు ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో వేడి తగ్గే అవకాశం ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా బయట కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి. దీంతో అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి.
ఇక ఇంట్లో స్వచ్ఛమైన గాలి రావాలంటే మంచి మొక్కలను పెంచుకోవాలి. ఇంటి ముందు లేదా గుమ్మం ముందు కొన్ని రకాల మొక్కలు పెంచుకోవడం వల్ల ఇవి వేడినీ గ్రహించి ఆక్సిజన్ ను ఎక్కువగా విడుదల చేస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల మొక్కలు వేడిని గ్రహించి చల్లదనాన్ని అందిస్తాయి. వీటిని ఇంటి లోపల కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల గది మొత్తం చల్లగా మారుతుంది.
ఇంటికి గది చల్లగా మారడానికి కేవలం ఏసీలు మాత్రమే అవసరం లేదు. ఇలా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గదులను చల్లగా ఏర్పరచుకొని ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. నిత్యం ఏసీలో ఉండి ఒకేసారి ఎండవేడికి బయటకు వెళ్లడం వల్ల కూడా అనారోగ్యాన మారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా చిన్న పిల్లలు ఎక్కువగా ఏసీలో ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని కొందరు తెలుపుతున్నారు.