Summer Car Care Tips: ఎండాకాలం మండిపోతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు అంటే కత్తి మీద సామూలాంటిదే. అందులోనూ కారులో ప్రయాణం చేయడం అంటే మరీ కష్టంగా మారుతుంది. అయితే కారులో ప్రయాణం చేయకున్నా.. ఈ వేసవిలో కారును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కారు ఎండలో ఉండడంవల్ల అనేక రకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవి తాపానికి కారులో ఉండే కొన్ని పార్ట్స్ దెబ్బతిని అవకాశం ఉంది. కారును నిత్యం చల్లగా ఉండేట్లు చూడడమే వినియోగదారులు చేయాల్సిన పని. లేకుంటే తీవ్రంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎండాకాలంలో కారు విషయంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏంటంటే?
Also Read: కాసేపట్లో ఎగ్జామ్.. హాల్ టికెట్ ను గద్ద ఎత్తుకెళ్లింది.. వీడియో వైరల్
ప్రతి కారుకు ఇంజన్ గుండెకాయ లాంటిది. ఇంజన్ సమర్థవంతంగా ఉంటేనే కారు ఎంత దూరమైనా ఈజీగా ప్రయాణం చేయగలుగుతుంది. అయితే వేసవిలో కారు ఇంజన్ హీటెక్కి అవకాశం ఉంది. దీంతో కారు ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. దీనిని కూల్ చేయడానికి కూలెంట్ స్థాయిలను సరిగా చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా రేడియేటర్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంజన్లోని మిగతా భాగాలు వేడి కాకుండా రక్షణ చర్యలు చేపట్టుకోవాలి.
ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ప్రతీ కారులో ఏసీ తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొందరు వేసవిలో ఏసీ నిర్వహణలో పొరపాటు చేస్తుంటారు. అలా కాకుండా ఏసీ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే దూర ప్రయాణాలు చేసిన సమయంలో ఏసీ ఒక్కసారిగా ఆగిపోతే లోపల ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనుషుల్లాగే కార్లను కూడా కాపాడుకుంటూ ఉండాలి. వీటి కోసం ప్రత్యేకంగా కవర్లను కప్పుతూ ఉండాలి. లేదా చెట్టు నీడన ఉంచే ప్రయత్నం చేయాలి. సూర్య రష్మికి కారు ప్లాస్టిక్ భాగాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అలాగే కారు పై భాగం కలరు కూడా షేర్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
రెగ్యులర్గా సర్వీస్ చేసుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటే వేసవిలో ప్రయాణాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఇలాంటి సమయంలో కారు చెడిపోతే మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. సర్వీస్ చేయడం వల్ల కారులో ఉండే సమస్యలు ముందుగానే తెలిసిపోతాయి. దీంతో వాటిని పరిష్కరించుకుంటే తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడాల్సి ఉండదు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయాల్సిన సమయంలో ఈ సమస్య ఎదురైతే తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు.
వేసవి కాలంలో కార్ల టైర్లు ఎండవేడికి దెబ్బ తినే అవకాశం ఉంది. అందువల్ల టైర్లు ఎప్పుడూ సరిగ్గా ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవాలి. అలా కాకుండా డ్యామేజ్ అయిన టైర్లపై ప్రయాణం చేయడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రయాణంలో ఇవి దెబ్బతింటే తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల కారు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని ఆటోమొబైల్ రంగ నిపుణులు తెలుపుతున్నారు.