Kerala: దేవుడి సొంత భూమిగా కేరళ రాష్ట్రం పేరుపొందింది. ఇక్కడ అన్ని జిల్లాలు దాదాపు భూలోక స్వర్గం లాగానే ఉంటాయి. ప్రస్తుతం కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కాసరగోడ్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పరీక్ష రాయడానికి కాసర్ గోడ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం వద్దకు అభ్యర్థులు ఉదయం 7:30 నిమిషాలకు రావడం మొదలుపెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓ అభ్యర్థి ఆ సెంటర్ వద్దకు వచ్చాడు. తనతో పాటు తెచ్చుకున్న హాల్ టికెట్ ను పక్కనపెట్టి కూర్చున్నాడు. తనతో పాటు పరీక్ష రాయబోతున్న అభ్యర్థులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఒక గద్ద వచ్చింది. అమాంతం అది ఆ అభ్యర్థి హాల్ టికెట్ ను పట్టుకొని వెళ్ళింది. అయితే అది తినడానికి పనికి రాకపోవడంతో.. తన కాళ్లతో పట్టుకుంది. అదే ఎగ్జామ్స్ సెంటర్ హాల్ కిటికీ పైన ప్రశాంతంగా కూర్చుంది. అంతేకాదు వచ్చి పోయే వాళ్ళను తదేకంగా చూడ సాగింది.
Also Read: హేజిల్ వుడ్ కు చుక్కలు.. స్టబ్స్ తో కలిసి మెరుపులు.. కేఎల్ రికార్డులు ఇవి..
ఎగ్జామ్ సెంటర్లో ఆందోళన..
గద్ద అలా వచ్చి.. హాల్ టికెట్ ను తీసుకెళ్లడంతో ఎగ్జామ్ సెంటర్లో ఆందోళన నెలకొంది. ఇక ఆ అభ్యర్థి టెన్షన్ అయితే మామూలుగా లేదు.. తనతో పాటు పరీక్ష రాసే స్నేహితులతో మాట్లాడుతుండగా.. అటువైపు వచ్చిన గద్ద హాల్ టికెట్ ను నోట కరుచుకుని వెళ్ళింది. ఒక్కసారిగా ఈ ఘటనతో ఆ అభ్యర్థి షాక్ కు గురయ్యాడు. ఆ తర్వాత తన హాల్ టికెట్ కోసం గద్ద వెంట పరుగులు తీశాడు. చివరికి ఆ హాల్ టికెట్ ను గద్ద వదిలిపెట్టింది. కానీ ఈ మధ్యలో జరిగిన తతంగం ఓ సస్పెన్స్ సినిమాను తలపించింది. అయితే ఆ హాల్ టికెట్ ను ఆ గద్ద తినే వస్తువు అనుకుని ఉండవచ్చని.. అందువల్లే ఎత్తుకుపోయిందని స్థానికులు అంటున్నారు.. కాసర్ గ డ్ ప్రాంతంలో జీవవైవిధ్యం బాగుంటుంది. ఇక్కడ గద్దలు పెద్ద సంఖ్యలో జీవిస్తుంటాయి. గద్దలు మాంసాహారులు కాబట్టి.. ఇక్కడి సమీప ప్రాంతాల్లోని చేపల చెరువుల్లో అవి వేటాడుతుంటాయి. చనిపోయిన చేపలను ఆహారంగా తింటూ ఉంటాయి. ఒక్కోసారి చేపలు లభించినప్పుడు ఇలా గ్రామాల మీద పడుతుంటాయి. చిన్న చిన్న కోడి పిల్లలను ఎత్తుకుపోతుంటాయి. అయితే ఆ గద్ద పిల్లకు ఆహారం లభించకపోవడంతో.. హాల్ టికెట్ ను మాంసాహార ముక్క అనుకుని ఉండొచ్చు. అందువల్లే దానిని ఎత్తుకుపోయింది. అది తినడానికి పనికిరాదని భావించి వదిలేసింది. లేకుంటే ఈపాటికి హాల్ టికెట్ సర్వనాశనం అయ్యేదని” స్థానికులు అంటున్నారు.. చివరికి గద్ద హాల్ టికెట్ వదిలిపెట్టడంతో ఆ అభ్యర్థికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఇక ఆ తర్వాత అతడు బతుకు జీవుడా అనుకుంటూ హాల్ టికెట్ తో ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళాడు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో.. ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
View this post on Instagram