Sugarcane Juice Business:వేసవి సమీపిస్తోంది. ఎండలు మండుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోంది. ప్రారంభంలోనే ఇలా ఉంటే నడి వేసవిలో పరిస్థితి చెప్పనక్కర్లేదు. అందుకే వేసవి తాకిడి నుంచి దూరం కావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా చెరకు రసం తాగితే వేసవి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో దాహాన్ని తీర్చడంతో పాటు ఎన్నో ఔషధ గుణాలతో శరీరానికి చెరకు రసం రక్షణ కవచంలా నిలుస్తుంది. అందుకే ఈ వేసవిలో చెరకు రసాన్ని తాగి ఉపశమనం పొందుతాం. చెరకు రసం వ్యాపారం నిరుద్యోగ యువతకు కొంత అండగా నిలుస్తుంది. తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారంగా నిలుస్తుంది.చెరకు రసంతో ఎటువంటి ప్రయోజనాలు,మీకు ఆసక్తి ఉంటే ఆ వ్యాపారం ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? చేయాలంటే ఏం అనుమతులు తీసుకోవాలి? ఎలా రిజిస్టర్ కావాలి? అన్న సమగ్ర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..
ఒక గ్లాసు చెరకు రసం..వేసవిలో మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. చిన్నపిల్లల నుంచి గర్భిణీ వరకూ.. పచ్చ కామెర్ల నుంచి క్యాన్సర్ రోగుల వరకూ అందరూ తాగవచ్చు.వేసవిలో దాహం తీర్చుకునేందుకు ఎన్నెన్నో డ్రింకులు తాగుతాం. ఐస్ క్రీమ్ లు తింటాం. కానీ ఆరోగ్య పరిరక్షణలో చెరకు రసానిది ప్రత్యేక స్థానం.చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఐరన్, పొటాషియం ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే అన్ని అవసరమైన పోషకాలు ఉంటాయి. ఈ కారణంగా, ఒక గ్లాసు చెరుకు రసం మీ శరీరంలో శక్తిని నింపుతుంది అలసటను తొలగిస్తుంది. దాహాన్ని తీర్చడమే కాకుండా అందులోని ఔషధ గుణాల వల్ల శరీరాన్ని కాపాడుతుంది.శరీరానికి లోపలి నుండి చల్లదనాన్ని అందించడంతో పాటు అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది.మీరు బరువు తగ్గడానికి సహజ నివారణగా చెరకు రసాన్ని తీసుకోవడం ప్రారంభించవచ్చు. చిన్నపిల్లలైనా లేదా పెద్దవారైనా, జ్వరం కారణంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో చెరకు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. ఈ జ్యూస్ శరీరంలోని ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. జ్వరం నుంచి ఉపశమనం ఇస్తుంది.శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి చెరుకు రసం తీసుకోవచ్చు. ఈ నేచురల్ డ్రింక్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీడ్నీలో రాళ్లపై సైతం చక్కగా పోరాడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి కూడా పని చేస్తుంది.చెరకులో ఉండే పొటాషియం జీర్ణవ్యవస్థను సజావుగా నడిపించడంలో సహాయపడుతుంది, ఇది గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలకు సైతం చెక్ చెబుతుంది. మహిళల గర్భధారణ సమయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ గర్భధారణ సమయంలో జీవక్రియను పెంచి బరువును అదుపులో ఉంచుతాయి.ఇన్ని ప్రయోజనాల సమాహారమైన చెరకు ఆరోగ్య సంజీవిని అన్నమాట.
వేసవి సమీపిస్తుండడంతో ఎక్కడ చూసినా చెరకు రసం దుకాణాలు దర్శనమిస్తున్నాయి. జనాలను ఆకర్షించే విధంగా సేంద్రీయ చెరకు రస కేంద్రాలు సైతం వెలుస్తుండడం విశేషం. అయితే నిరుద్యోగులకు ఇదో లాభసాటి వ్యాపారంగా మారుతోంది. విరివిగా ఉపాధినిస్తోంది. ఈ దుకాణాలకు ఎటువంటి అనుమతులు? రిజిస్ట్రేషన్లు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.మీరు ఏదైనా ప్రాంతంలో దుకాణాన్ని తెరవాలని ఆసక్తి ఉంటే నేను చెప్పబోయే విషయాలను ఆసక్తిగా గమనించాలి. ముందుగా ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది తప్పనిసరి కూడా. కంపెనీని పేరును రిజిస్టర్ చేసుకోవాలి. రెండోది జీఎస్టీ.ఏ రకమైన వ్యాపారానికైనా జీఎస్టీ నంబర్ తప్పనిసరి. మూడోది ట్రేడ్ లైసెన్స్. మీరు స్టేట్ రెగ్యులేషన్ కు అనుగుణంగా స్థానిక అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. నాలుగోది కాలుష్య నియంత్రణ మండలి నుంచి ధ్రువీకరణ. చెరకు రసం వ్యాపారం ఎటువంటి కాలుష్యం వెదజల్లదని ధ్రువీకరిస్తూ స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం పొందాలి. ఐదు ఎంఎస్ఎంఈ, ఎస్ఎస్ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణ రాయితీని పొందవచ్చు. ఆరు ట్రేడ్ మార్కు. ఏడు ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వారి నుంచి లైసెన్స్ కూడా పొందాలి.
జనాల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటుచేసుకుంటే చాలా మంచిది. ముందుగా దుకాణానికి మునిసిపాల్టీ, పంచాయతీ అనుమతి తీసుకోవాలి. అక్కడ వ్యాపారాన్ని బట్టి మిషన్ ను ఏర్పాటు చేసుకోవాలి. రూ.10 వేల నుంచి లక్షలాది రూపాయల వరకూ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. శుచి,శుభ్రతకు పెద్దపీట వేయాలి. సాధారణంగా చెరకు రసం కాబట్టి ఈగలు, దోమలు ఎక్కువగా వాలుతుంటాయి. వాటికి చెక్ చెప్పేలా ఏర్పాట్లు చేసుకోవాలి. సేంద్రియ విధానంలో సాగుచేసిన చెరకునే వాడాలి. ఆ చెరకు రసం ఆరోగ్యానికి శ్రేయస్కరం. మరెందుకు ఆలస్యం. చెరకు రసం దుకాణాలను ఏర్పాటుచేసి వ్యాపారిగా మారుదాం. లాభాలను ఆర్జిద్దాం.