Goli Soda Business: ఒకప్పుడు దాహం వేస్తే ముందుగా గుర్తొచ్చేది గోలి సోడా. చిన్నచిన్న దుకాణాలు, రోడ్డులో బండ్లపై కూడా అమ్మేవారు. కొంచెం ఎక్కువ ఆహారం తీసుకున్న.. కడుపులో ఇబ్బంది ఉన్నా.. గోలి సోడా తాగితే మటుమాయం. అందులో సాల్ట్, లెమన్ ఫ్లేవర్ అప్పట్లో స్పెషల్. పేదవాడి డ్రింక్ కూడా ఇదే.అయితే 15 సంవత్సరాల క్రితం వరకు కనిపించిన ఈ సోడా కనుమరుగయ్యింది. కానీ ఇప్పుడు భిన్న ఫ్లేవర్స్ తో అందుబాటులోకి రావడం విశేషం. ఇటీవల కాలంలో ఈ ఫ్లేవర్ గోలి సోడా లకు విపరీతమైన గిరాకీ . ముఖ్యంగా జీరా, లెమన్, గ్రేప్స్, పైనాపిల్, జింజర్ లాంటి చాలా రకాల ఫ్లేవర్స్ తో ఈ గోలి సోడాలను తయారు చేయవచ్చు. ఇప్పుడు వేసవిలో ఇదో లాభసాటి వ్యాపారంగా కూడా మారిపోయింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవచ్చు కూడా. తక్కువ కాలంలో ప్రాఫిట్ కూడా పొందవచ్చు.మరి ఎందుకు ఆలస్యం ఫ్లేవర్డ్ గోలి సోడా వ్యాపారం గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
ఈ ఫ్లేవర్డ్ గోలి సోడా వ్యాపారం కోసం కావలసిన మిషనరీ ఏంటి? ముడి సరుకు ఎలా తెచ్చుకోవాలి? పెట్టుబడి ఎంత అవుతుంది? ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ బిజినెస్ కు ప్రధానంగా మూడు మిషన్ లు అవసరం. ఒకటి జ్యూస్ మిక్సర్ మిషన్. ఇందులో గోలీసోడాకు అవసరమైన జ్యూస్ ను మిక్స్ చేసుకోవచ్చు. రెండోది కార్బోనేటింగ్ మిషన్. మూడోది గ్యాస్ ఫిల్లింగ్ మిషన్. నీరు, పంచదార, ఇతరత్రా ఫ్లేవర్స్ కావాలి. ఇంకా ప్లాస్టిక్ గోలి సోడా బాటిల్లు కూడా అవసరం. ఇది ఆన్ లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కూడా. ఒక్కో బాటిల్ ధర 9 రూపాయల వరకు ఉంటుంది. ఇండియన్ మార్ట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.
ముందుగా జ్యూస్ మిక్సర్ లో నీరు, పంచధార, ఫ్లేవర్స్ వేసి ఫుల్లుగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత జ్యూస్ ను కొంచెం కొంచెం గోలి సోడాలో వేయాలి. గ్యాస్ ఫిల్లింగ్ మిషన్ ద్వారా ఫిల్లింగ్ చేసి గోలీని లాక్ చేయాలి. అయితే దీనికి ట్రయినింగ్ అవసరం. అయితే మిషన్లు సరఫరా చేసే వారే ఈ విధానంపై శిక్షణ కూడా ఇస్తారు. మిక్సర్ ఎలా చేయాలి? ఎలాంటి ఫ్లేవర్స్ కలపాలి? మిషన్ ఎలా వినియోగించాలి? అనే వాటిపై వారే ట్రైనింగ్ ఇస్తారు. ఈ మూడు మిషన్ల వరకు దాదాపు లక్ష అవుతుంది. ఇక రా మెటీరియల్ గురించి మరో 50 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రారంభ సమయానికి పదివేల బాటిళ్లు రెడీ చేసుకోవాలి. అందుకే ప్లాస్టిక్ సోడా బాటిల్ లకు 90000 అవసరముంటుంది. ఇక షాప్ అడ్వాన్సుతో పాటు ఇతర ఖర్చులతో కలిపి మొత్తం మూడు లక్షలతో ఫ్లవర్డ్ గోలి సోడా యూనిట్ అందుబాటులో వస్తుందన్నమాట.
అయితే ప్రాఫిట్ సైతం అలానే వస్తుంది. 300 ఎమ్ఎల్ గోలి సోడా బాటిల్ ధర మార్కెట్ లో 30 రూపాయిలుగా ఉంది. ఇందులో సోడా మేకింగ్ ద్వారా నాలుగు రూపాయలు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్లాస్టిక్ సోడా బాటిల్ ధర 9 రూపాయలు పలుకుతుంది. కరెంట్ బిల్లు, లేబర్ ఖర్చు వంటి ఇతరత్రా ఖర్చులు ఒక మూడు రూపాయల వరకు ఉంటాయి. అంటే మొత్తం ఖర్చు 16 రూపాయలు ఉంటుంది. జనరల్ గా హోల్ సేల్ ధరగా ఒక్కో గోలి సోడా బాటిల్ ను 21 రూపాయలకు అమ్మాలి. రిటైల్ షాపులకు ఈ రేటుకు విక్రయించుకోవచ్చు. అంటే ఒక్కో సోడా వద్ద మనం 5 రూపాయిలు ప్రాఫిట్ పొందుతామన్న మాట. అదే రిటైల్ షాపు వారు ఒక్క బాటిల్ వద్ద తొమ్మిది రూపాయలు ఆదాయం పొందుతారన్న మాట. వేసవిలో ప్రతిరోజూ 1000 బాటిల్ల వరకు అమ్మితే 5000 రూపాయలు ఇట్టే సంపాదించుకునే చాన్స్ ఉంది. బిజినెస్ పెరిగే కొలదీ మంచి సెంటర్ల చూసి మరో యూనిట్ ను ప్రారంభించుకోవచ్చు. అన్నిరకాల రూల్స్ పాటిస్తే అటు బ్యాంకు రుణం కూడా ఈజీగా పొందవచ్చు. అయితే ఎటువంటి వ్యాపారానికైనా నమ్మకమే ప్రధాన పెట్టుబడి. ఆ నమ్మకాన్ని నిలబెట్లుకొని కస్టమర్లను సెటిస్ ఫై చేస్తే ఈ వ్యాపార విస్తరణ చాలా ఈజీ. రోజుకు 5 వేల రూపాయలు ఏమిటి? పదివేల రూపాయలకు మించి ప్రాఫిట్ పొందడానికి ఇదో లాభసాటి వ్యాపారం అవుతుంది.
మనం ఈ యూనిట్ తెరిస్తే ముందుగా ఒక పది షాపులను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో షాపునకు 100 బాటిల్లను సరఫరా చేసిన మన టార్గెట్ రీచ్ అవ్వచ్చు. అయితే ఇది ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. ఓ ముగ్గురు వర్కర్స్ మాత్రం అవసరం. సోడా తయారీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని వర్కర్స్ గా తీసుకుంటే చాలా మంచిది. మరొకరు మార్కెటింగ్ చేయవలసి ఉంటుంది. షాపులకు సోడాలను అందించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వ్యాపారం చేసి మంచి ప్రాఫిట్ పొందవచ్చు అన్న మాట. ముందుగా లోకల్ లో మన బ్రాండ్ ను ప్రవేశపెట్టాలి. తర్వాత ఆ చుట్టుపక్క ప్రాంతాలకు విస్తరించాలి. మార్కెట్ లో మన సోడాలే కావాలి అనే రేంజ్ లో మంచి ఫ్లేవర్స్ తో సోడాలను అందిస్తే వ్యాపారం పెరగడం పక్కా.ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి వ్యాపారం.