Kushboo Daughter
Kushboo Daughter: 90లలో హీరోయిన్ గా వెండితెరను ఏలింది కుష్బూ. ముంబైకి చెందిన కుష్బూ టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈమె డెబ్యూ మూవీ కలియుగ పాండవులు. ఇదే చిత్రంతో వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కుష్బూ సత్తా చాటింది. ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాలు ఉన్నాయి. ఆల్రెడీ పెళ్ళైన నటుడు ప్రభుని కుష్బూ రెండో వివాహం చేసుకుంది. ఈ క్రమంలో వివాదాలు తలెత్తాయి. ఏడాదికే విడిపోయారు.
అనంతరం 2000లో దర్శకుడు, నటుడు అయిన సీ సుందర్ ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్దమ్మాయినే అవంతిక సుందర్. ఈమెది అంతా పాశ్చాత్య ధోరణి. ఒంటినిండా టాటూలు, జుట్టుకు రంగు చాలా మోడరన్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టె పోస్ట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తారు. అవంతిక సుందర్ నటన వైపు పోలేదు.
సాధారణంగా నటుల పిల్లలు నటననే వారసత్వంగా తీసుకుంటారు. అవంతిక సుందర్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతుండగా. ఎప్పుడూ పొట్టి బట్టల్లో మోడ్రన్ డ్రెస్సులో కనిపించే అవంతిక సుందర్ క్రాఫ్ టాప్ లెహంగా ధరించి దర్శనం ఇచ్చింది.
జుట్టుకు రంగు వేసి సరికొత్తగా దర్శనం ఇచ్చింది. ఇక అవంతిక సుందర్ ఫోటోలు చూసిన జనాలు అందంలో అమ్మ ఏం సరిపోతుంది అంటున్నారు. తమదైన కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కుష్బూ రాజకీయంగా కూడా రాణిస్తున్నారు. ఆమె బీజేపీ తరపున తమిళనాడులో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఆమె భర్త సుందర్ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు.
Web Title: Kushboo daughter avantika sundars photos goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com